తెల్ల జుట్టు మళ్ళీ నల్లగా మారుతుందా?

వయసు తక్కువగా ఉన్న వారిలో జుట్టు నెరుస్తుంటే ఆహార లోపాలను సరిదిద్దుకోవాలి.

కానీ నెరిసి పోయిన జుట్టు తిరిగి నల్లబడడం జరగదు. ఎందుకో తెలుసుకుందాం.

నిజానికి జుట్టు కుదుళ్లలో తెల్లగానే ఉంటుంది. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి మీద జుట్టు రంగు ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా 30 ఏళ్ళ వయసు తర్వాత జుట్టులో మెలనిన్ సాంద్రత క్రమంగా తగ్గుతుంది.

ఇది జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో దగ్గరి సంబంధీకుల్లో ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ జరిగి ఉంటే త్వరగా జుట్టు నెరవ వచ్చు.

జుట్టు ఫోలికిల్స్ లో మెలనిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతే తెల్లగా మారుతుంది.

జన్యుపరమైన కారణాలతో ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ జరిగితే ఇక వారి జుట్టు తిరిగి నల్లగా రావడం దాదాపు అసాధ్యమే.