కాఫీతోపాటు తినకూడని ఫుడ్స్ ఇవే సోర్ క్రీం, ఉల్లిపాయ, ఘాటైన రుచి ఉన్న పదార్థాలను.. కాఫీ తాగుతూ తినకూడదు. కాఫీతాగిన తర్వాత ఊరగాయలు తినకూడదు. ఊరగాయ ఆమ్లత్వం ఎక్కువ. కాఫీతోపాటు గార్లిక్ బ్రెడ్ తినకూడదు. కాఫీతో గార్లిక్ బ్రెడ్ తింటే జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి. సార్డినెస్ చేపలు తిన్న తర్వాత కాఫీ తాగకూడదు. ఈ రెండూ కలయికలు చాలా డేంజర్. పచ్చిఉల్లిపాయలు, కాఫీ రెండూ కూడా చాలా ప్రమాదకరం. ఈ రెండు ఒకేసారి తీసుకోకూడదు. వెనిగర్ సలాడ్ డ్రెస్సింగ్స్ ఆమ్లత్వం కలిగి ఉంటాయి. కాఫీతోపాటు వీటిని తీసుకోకూడదు. వాసాబి తీవ్రమైన వేడిని కలిగిస్తుంది. దీని టేస్ట్ ప్రొఫైల్ కాఫీకి సరిపోదు. రెండూ ఒకేసారి తీసుకుంటే నోటిదుర్వాసన వస్తుంది. చీజ్, కాఫీ రెండింటి కలయిక చాలా ప్రమాదకరం. ఈ రెండూ ఒకేసారి తీసుకోకూడదు.