హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నారా? ఇవి అస్సలు మిస్ కావద్దు బిర్ బిల్లింగ్ కాంగ్రా జిల్లాలో ఉన్న బిర్ ప్రకృతి సౌందర్యం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సాహసాలను ఇష్టపడేవారికి సరైన ప్రాంతమిది. చుట్టూ మంచు మధ్యలో ప్రశార్ సరస్సు. ఈ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. బారోట్.. ఇది ఉహ్ల్ నది ఒడ్డున ఉంది. చుట్టూ ధౌలాధర్ పర్వత శ్రేణి ఉంది. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దరంఘటి.. దట్టమైన అభయారణ్యం. ట్రెక్కింగ్ ట్రయల్ కూడా ఉంది. సాహస యాత్రికులకు ఇది సరైన ప్లేస్. చిండి.. దట్టమైన అడవులు, ఆపిల్ తోటలు, అందమైన కూగ్రామాలతో ఉంటుంది. శీతాకాలంలో అందంగా కనిపిస్తుంది. పబ్బర్ వ్యాలీ ప్రకృతి, మెరిసే నదులు, పచ్చిక బయళ్లు.. ఏకాంతం కోరుకునేవారికి బెస్ట్ డెస్టినేషన్. తీర్థన్ లోయ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. దట్టమైన అడవులు, మనోహరమైన గ్రామాలకు ప్రసిద్ధి.