మనిషి, జంతువు, చెట్లు.. ఇలా ప్రాణి ఏదైనా వాటి మనుగడకు నీరు అవసరం. అలాంటిది నీరు తాగకున్నా కొన్ని జంతువులు బతుకుతున్నాయి. ఏవంటే? ఒంటెలు నీరు తాగకుండా బతికేందుకు కొవ్వును హ్యంపర్ లో స్టోర్ చేసుకుంటాయి. దీంతో నీరు తాగకున్నా బతికేస్తాయి. ఆస్ట్రేలియాలో ఉండే థ్రోన్ డెవిల్ నీరు తాగకుండా బతకగలదు. దాని చర్మానికి ఉండే ముల్లుల ద్వారా నీరు అందుతుంది. ఫినిక్ ఫాక్స్ అది తినే పురుగులు, చెట్ల నుంచి వచ్చే నీటితో బతుకుతుంది. దాని కిడ్నీలకు నీరు కన్జర్వ్ చేసే ఎఫిషియన్సీ ఉంది. ఎడారి తాబేలు కూడా నీరు తాగకుండా బతకగలదు. అది తీసుకునే ఆహారం ద్వారా నీటిని వాడుకుంటుంది. ఆస్ట్రేలియాలో ఉండే వాటర్ హోల్డింగ్ జాతి కప్పలు చర్మంలో నీటిని స్టోర్ చేసుకుంటాయి. డ్రై ప్లేసెస్ లో దాచిన నీటిని వాడుకుంటాయి. శాండ్ గజెల్ .. ప్లాంట్స్ నుంచి నీటిని తీసుకుంటుంది. నీటిని తక్కువగా వాడి, అవసరానికి స్టోర్ చేసే సామర్థ్యం కిడ్నీలకు ఉంటుంది. కంగారూ ఎలుకలు.. మెటబాలిక్ ప్రాసెస్ లో ఉత్పత్తైన నీటిని వాడుకుంటుంది. దాని వల్ల ఇది ఎడారి ప్రాంతంలో కూడా నివసించగలదు. మరిన్ని వింతలు, విశేషాల కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.