కళ్లను చల్లగా ఉంచేందుకు ఆయుర్వేద చిట్కాలు

కంటి చూపు పిత్తదోష ఆధ్వర్యంలో ఉంటుంది. దీనిని సంతులనంలో ఉంచుకుంటే కంటి ఆరోగ్యం బావుంటుంది.

కంటి ఆరోగ్యానికి హైడ్రేటెడ్ గా ఉండడం అవసరం. చాలా ఎక్కువ నీళ్లు తాగడం, నీరు ఎక్కువ కలిగిన పండ్లు, కాయగూరలు తీసుకోవడం అవసరం.

హెర్బల్ టీలతో కూడా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. కనుక వీటిని కూడా తరచుగా తీసుకోవచ్చు.

పిత్తదోషం సంతులనంతో ఉంటే కంటి ఆరోగ్యం బావుంటుంది. కనుక చల్లబరిచే కీర, కొబ్బరి నీళ్లు, కూరలు ఎక్కువ తీసుకోవాలి.

రోజు వారీ ఆహారంలో కొద్దిపాటి నెయ్యి చేర్చుకుంటే కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పచ్చగడ్డి తినే ఆవుల పాల నుంచి వచ్చిన నెయ్యి మంచిది.

శరీరంలోని ఇతర భాగాలలాగ కంటికి కూడా వ్యాయామం అవసరం. కంటికి సంబంధించిన చిన్నచిన్న వ్యాయామాలు తప్పక చెయ్యాలి.

తగినంత నిద్ర పోవడం చాలా అవసరం. కంటి ఆరోగ్యానికి 7-8 గంటల నిద్ర అవసరం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే