Image Source: pexels

మిగిలిపోయిన అన్నం పాడవకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మిగిలిపోయిన అన్నం.. తాజాగా, పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

లీసెస్టర్ విశ్వవిద్యాలయం నిపుణులు.. మిగిలిపోయిన ఆహారాన్ని తినేందుకు కొన్ని టిప్స్ చెప్పారు.

మిగిలిన ఆహారం రెండు రోజుల్లోపే తినాలి. బ్యాక్టీరియాని నివారించేందుకు ఫ్రిజ్‌లో 0-5 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచాలి.

ఇంకొన్ని పదార్థాలను మూడు నెలల పాటు భద్రపరచాలంటే 18 డిగ్రీల సెల్సియస్ వద్ద గడ్డకట్టేలా చూడాలి.

తిరిగి తినేటప్పుడు 74 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే అందులోని బ్యాక్టీరియ నాశనం అవుతుంది.

ఫ్రీస్టోన్ ప్రకారం మిలిగిపోయిన ఆహారాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు మళ్లీ వేడి చేయకూడదు.

ఎక్కవసార్లు వేడి చేస్తే బ్యాక్టీరియాను చంపడం కష్టం అవుతుంది.

ఆర్డర్ చేసిన ఫుడ్ మిగిలితే 2 గంటలలోపు ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ వేడి చేసుకుని తినవచ్చు.

Image Source: pexels

ఒకవేళ గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటలకుపైగా ఉంచితే దాన్ని మళ్లీ వేడి చేసుకోకపోవడమే మంచిది.