9–1 Rule for Weight Loss : బరువు తగ్గాలనుకుంటే ఈ 9–1 రూల్ ఫాలో అయిపోండి.. బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Weight Loss Tips : బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా? అయితే మీరు సింపుల్‌గా బరువు తగ్గేలా చేసే 9–1 రూల్ ఫాలో అయిపోమంటున్నారు నిపుణులు. మంచి ఫలితాలు మీ సొంతం అంటున్నారు.

Weight Loss Rules : ఈ ఏడాది ముగిసేలోపు బరువు తగ్గాలనేది మీ గోల్ అయితే.. కచ్చితంగా మీరు 9–1 రూల్ ఫాలో అయిపోండి. సింపుల్‌గా ఫాలో అవ్వగలిగే ఈ రొటీన్ మీరు బరువు తగ్గడంలో వండర్స్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రూల్ ఫాలో అయితే మీపై బరువు గురించిన ప్రెజర్ కూడా తగ్గుతుంది. యాక్టివ్‌గా ఉండడంతో పాటు ప్రొడెక్టివ్గా ఉంటారు. ఇంతకీ ఈ 9–1 రూల్ ఏంటో.. దానివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
9 వాకింగ్ కోసం..
రోజుకు 9000 అడుగులు వేసేలా చూసుకోండి. అంటే రోజూ ఉదయం లేదా సాయంత్రం.. లేదా ఉదయం 4,500.. సాయంత్రం 4,500 అడుగులు నడవండి. దీనివల్ల శరీరంలో కేలరీలు బర్న్ అవుతాయి. మెటబాలీజం పెరుగుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. బరువు తగ్గుతారు.
8 హైడ్రేషన్ కోసం
రోజుకు 8 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంది. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. కార్బ్స్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఫుడ్ కంట్రోల్ అవుతుంది. అలాగే డీహైడ్రేషన్ బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
7 నిద్ర కోసం
రోజుకు కనీసం 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. చాలామంది నిద్ర విషయంలో రాజీపడతారు కానీ.. తక్కువ నిద్ర వల్ల ఊబకాయం వస్తుంది. అలాగే ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయి. బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి కనీసం 7 గంటలు పడుకోండి. దీనివల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం, శరీరం రికవరీ అవ్వడంతో పాటు బరువు తగ్గుతారు.
6 మెడిటేషన్
రోజుకు కనీసం ఆరు నిమిషాలు మెడిటేషన్ చేయండి. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా స్ట్రెస్ వల్ల వచ్చే ఫుడ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది.
5 ఫుడ్ కోసం..
కచ్చితంగా మీరు తీసుకునే రోజూవారీ డైట్లో ఫ్రూట్స్, కూరగాయలు కనీసం 5 ఉండేలా చూసుకోండి. అంటే క్యారెట్, బీన్స్, బీట్రూట్ సలాడ్స్‌గా మూడు తీసుకుంటే యాపిల్, అవకాడోతో కలిపి 5 అవుతాయి అనమాట. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్, విటమిన్స్ అందుతాయి. ఇవి కడుపు నిండుగా చేసి లోపలి నుంచి పోషణ అందిస్తాయి. అనవసరమైన ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి.
4 బ్రేక్ కోసం..
మీరు ఏపని చేసినా.. దానినుంచి కనీసం నాలుగుసార్లు బ్రేక్ తీసుకోండి. అంటే వర్క్ చేసినప్పుడు బ్రేక్ తీసుకుని వాక్ చేయండి. రీల్స్ చూస్తున్నప్పుడు బ్రేక్ తీసుకుని కాసేపు బయట కూర్చోండి. ఇలా ఏ పని చేసినా.. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకండి. రిలాక్స్ అవ్వండి. దీనివల్ల మీరు కాస్త డైవర్ట్ అవుతారు. అలాగే మెటబాలీజం కూడా పెరుగుతుంది. జీవక్రియ పెరిగితే బరువు తగ్గుతారు.
3 మీల్స్ కోసం..
రోజుకు మూడు సార్లు తినాలి. అలాగే మధ్యలో మూడుసార్లు స్నాక్స్ ప్లాన్ చేసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు. బరువు తగ్గడంలో, ఫిట్‌గా ఉండడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది.
2 ఫుడ్స్ అవాయిడ్ చేయండి..
ప్రాసెస్ చేసినా, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి జీర్ణ సమస్యలు పెంచుతాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. కాబట్టి వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండండి. అప్పుడు బరువు కంట్రోల్ అవుతుంది.
1 యాక్టివిటీ..
రోజుకు కనీసం ఏదొక యాక్టివిటీ చేయండి. అది ఎలా ఉండాలంటే ఎక్స్ట్రా కేలరీలు బర్న్ చేసేదై ఉండాలి. ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గేలా ఉండాలి. దీనికోసం డ్యాన్స్ చేయవచ్చు. జిమ్‌కి వెళ్లొచ్చు.. నచ్చిన అవుట్ డోర్ గేమ్ ఆడవచ్చు. స్విమ్మింగ్ ఇలా ఏదైనా మీ ఇష్టమే.
ఈ నెంబర్స్ ఫాలో అవుతూ ఉంటే కచ్చితంగా బరువు తగ్గుతారు. ఈ ప్రాసెస్‌లో బ్యాలెన్స్డ్ డైట్ కచ్చితంగా తీసుకోవాలి. షుగర్ తగ్గించాలి. ఫ్రై చేసిన, జంక్ ఫుడ్స్ తినకూడదు. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఎంచుకోకూడదు. వీటి ఫలితం ఒక్కరోజులోనే రాదు. కాబట్టి రెగ్యులర్‌గా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.






















