అన్వేషించండి

First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు

First International Trip | తొలిసారి విదేశాలకు వెళ్లే చాలా మంది అవసరానికి మించి లగేజీ ప్యాక్ చేసుకోవడమో లేక ముఖ్యమైన సామాన్లు మరిచిపోవడం జరుగుతుంది. షెడ్యూల్ సరిగ్గా చేసుకోకపోతే లోకేషన్లు మిస్ అవుతాయి.

First international Trip | విదేశీ ప్రయాణాలు చేయాలని, అక్కడి ప్రాంతాలు చూడాలనేది చాలా మందికి ఒక కల.  పాస్‌పోర్ట్‌పై మొదటి స్టాంప్ పడేటప్పటి ఉత్సాహం, కొత్త ప్రదేశాలను చూడాలనే ఆనందం, ఇప్పటివరకు కేవలం సినిమాలు, ఫోటోలు లేదా సోషల్ మీడియాలో మాత్రమే చూసిన ప్రాంతాలకు మనం వెళ్తున్నాం అని ఫీల్ అవుతారు. మొదటిసారి విదేశీ ప్రయాణం చేసే వారికి ఈ అనుభవం మరింత ఉద్వేగభరితంగా మారనుంది. తొలి ఫారిన్ ట్రిప్ పట్ల ఉండే ఉత్సాహం కొన్నిసార్లు మనతో చిన్న తప్పులు చేయిస్తుంది. తద్వారా అది ట్రిప్ ఎంజాయ్‌మెంట్ పాడు చేయవచ్చు.

దీనిపై ట్రావెల్ నిపుణులు ఏమంటున్నారంటే.. ఫస్ట్ టైం విదేశాలకు వెళ్లే వారు తరచుగా ప్లానింగ్‌లో కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. చాలా మంది కొత్త ప్రయాణికులు ట్రావెలింగ్ అనుభవం కంటే వారి ఊహలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ కారణంగా అనేక విషయాలు పట్టించుకోరు. తద్వారా ట్రిప్ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఫస్ట్ టైం ఫారిన్ టూర్ వెళ్తుంటే.. మీ ట్రిప్ పాడవకుండా ఉండటానికి ఈ 4 తప్పులు చేయవద్దని సూచిస్తున్నారు.

ముఖ్యమైన వస్తువులను మరచిపోవడం
కొందరు వ్యక్తులు అవసరానికి మించి సామాన్లు పెట్టుకుంటారు. మరికొందరు ప్రయాణికులు కొన్ని ముఖ్యమైన వస్తువులను చివరి నిమిషంలో మరిచిపోతుంటారు. ముఖ్యంగా ఛార్జర్, అడాప్టర్ లేదా టాయిలెట్రీస్ వంటి వస్తువులు తరచుగా మిస్ చేస్తారు. పలు దేశాల్లో ఈ వస్తువులు ఖరీదైనవి. లేదా మీ డివైజ్‌లకు సరిపడా దొరకకపోవచ్చు. దీనివల్ల ట్రిప్‌లో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అవసరానికి మించి సామాన్లు ప్యాక్ చేయడం
ఫస్ట్ టైం విదేశాలకు వెళ్లే చాలా మంది అవసరానికి మించి లగేజీ ప్యాక్ చేసుకుంటారు. అన్ని కండీషన్లకు సిద్ధంగా ఉండాలని భావిస్తారు. అందుకే అదనపు బట్టలు, వస్తువులను బ్యాగ్‌లో పెట్టుకుంటారు. దీనివల్ల లగేజీ పెరగవచ్చు. కొన్నిసార్లు ఎక్స్‌ట్రా బ్యాగేజ్ ఫీజు చెల్లించాల్సి రావచ్చు. ఎక్కువ లగేజీ ఉండటం వల్ల ప్రయాణంలో అటు ఇటు ఎక్కువ తిరగడం కష్టమవుతుంది. ఓవర్ ప్యాకింగ్ వల్ల చివరి నిమిషంలో హడావిడిగా వస్తువులను చేర్చడం, ఒకే వస్తువును మళ్లీ పెట్టుకోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ట్రావెల్ ప్లానింగ్ మిస్ ఫైర్
మొదటిసారి విదేశీ ప్రయాణం చేసే వారు కొన్నిసార్లు తమ షెడ్యూల్‌ను పూర్తిగా నింపేస్తారు.. అంటే చాలా ప్రదేశాలను ప్లాన్ చేస్తారు. ఒక ప్లేస్ నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం సులభం, త్వరగా అవుతుందనుకుంటారు. వాస్తవానికి ఎల్లప్పుడూ అలా జరగదు. విదేశాలలో పబ్లిక్ ప్రదేశాల గురించి అవగాహన లేకపోవడం, లాంగ్ క్యూ లైన్స్ లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యం కావడంతో ప్లాన్ మారవచ్చు. దీనివల్ల లోకేషన్లు చూడాలనే హడావిడి, కొన్ని ప్రదేశాలను మిస్ అవ్వడం వంటివి మొత్తం ట్రిప్ సమయంలో ఒత్తిడిని కలిగిస్తాయి.

ఏర్పాట్లలో బ్యాలెన్స్ కోల్పోవడం

ట్రావెల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొత్త ప్రయాణికులు తరచుగా ఫ్లైట్, హోటల్ బుకింగ్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ ప్రయాణించాల్సిన వేగాన్ని అంచనా వేయలేకపోతారు. ఒక రోజులో ఎంత తిరగడం సాధ్యం. ఎప్పుడు విశ్రాంతి అవసరం, వరుస ప్రయాణాల వల్ల అలసట త్వరగా పెరుగుతుంది అనే విషయాలు అంతగా ఆలోచించరు. ఇటువంటి పరిస్థితుల్లో తమ షెడ్యూల్‌ను ఎంత బిజీగా మార్చుకుంటారంటే, విశ్రాంతి తీసుకోవడానికి లేదా అకస్మాత్తుగా ఏదైనా కొత్త లోకేషన్ చూసేందుకు టైం ఉండదు. దీనివల్ల ట్రిప్ ఆనందాన్ని ఇచ్చే బదులు ఒత్తిడి, అలసటతో ముగుస్తుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget