అన్వేషించండి

Smart Travel Hacks : బడ్జెట్ ట్రావెలర్ టిప్స్.. ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవలసిన 10 హ్యాక్స్ ఇవే

Golden Rules for Travel : ట్రావెలింగ్ అంటే ఇష్టముంటే.. మీరు ఈ 10 హ్యాక్స్ కచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇవి మీకు మంచి ట్రావెల్ ఎక్స్​పీరియన్స్ ఇవ్వడంతో పాటు.. బడ్జెట్​ ఫ్రెండ్లీగా ఉంటాయి.

Top 10 Genius Budget Travel Tips : ప్రపంచాన్ని పర్యటించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఈ కోరికకు బ్యాంక్ బ్యాలెన్స్ సపోర్ట్ చేయదు. అలా మీరు కూడా ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారా? అయితే మరపురాని ప్రయాణాలను స్మార్ట్​గా ఎలా ప్లానింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫ్లెక్సిబిలిటీ నుంచి మొదలుపెట్టి.. కొన్ని హ్యాక్స్ ఫాలో అవ్వడం వల్ల బడ్జెట్​లోనే మీరు ట్రావెల్ చేయగలుగుతారు. ఫ్యామిలీతో ప్లాన్ చేసినా.. సోలోగా వెళ్లాలన్నా బడ్జెట్‌ తక్కువలో ట్రిప్ పూర్తి చేసేందుకు ఫాలో అవ్వాల్సిన హ్యాక్స్ ఏంటో చూసేద్దాం. 

కొంతమందికి విమాన ప్రయాణాలు ఎక్కువ చేయడం, ఎక్కువ రోజులు డెస్టనీలో ఉండడం ఇష్టం. కానీ బడ్జెట్​ ఏమో తక్కువ ఉంటుంది. కానీ మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే తక్కువ బడ్జెట్​లో కూడా పర్​ఫెక్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఖర్చులను తగ్గించే తెలివైన మార్గాలు ఏంటంటే.. 

తేదీలు ఫిక్స్ అవ్వండి..

మీరు తక్కువ ఖర్చులో ప్రయాణించాలంటే ముందుగా ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్ డేట్ ఫిక్స్ చేసుకోవడం. మీరు ప్రయాణించే సమయంలో ఉండే డిమాండ్, సీజన్, వారంలోని రోజు ఆధారంగా విమాన ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కాబట్టి వారం మధ్యలో ముఖ్యంగా.. మంగళ, బుధవారాల్లో విమాన ఛార్జీలు తక్కువ అవుతాయి. అలాగే ఆఫ్-సీజన్ నెలల్లో విమానాలు, వసతి ఖర్చులు తగ్గుతాయి. ఛార్జీలను ట్రాక్ చేస్తూ.. ట్రావెల్ చేస్తే మంచిడీల్స్ పొందవచ్చు. తెల్లవారుజామున లేదా రాత్రిపూట విమానాలు కూడా చౌకగా ఉంటాయి.

స్మాల్ డిజిటల్ ట్రిక్

మీ సెర్చ్​ను ట్రాక్ చేయడానికి విమానయాన సంస్థలు, బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కుక్కీలను ఉపయోగిస్తాయి. మీరు ఒకే మార్గాన్ని పదే పదే చూస్తే.. డిమాండ్ ఆధారిత అల్గారిథమ్‌ల కారణంగా ధరలు పెరిగినట్లు కనిపించవచ్చు. కాబ్టటి ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజ్ చేయడం మంచిది. దీనివల్ల ఛార్జీలు ప్రభావితం కాకుండా ఉంటాయి. బుకింగ్ చేయడానికి ముందు మీ బ్రౌజర్ కుక్కీలను క్లియర్ చేయండి. పరికరాలను మార్చండి. మీ టికెట్‌ను ఖరారు చేసేముందు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ధరలను చెక్ చేయండి. ఈ చిన్న డిజిటల్ ట్రిక్ కొన్నిసార్లు అనవసరమైన ఛార్జీల పెంపును నిరోధిస్తుంది.

లగేజీ విషయంలో జాగ్రత్తలు

చెక్డ్ బ్యాగేజీ ఫీజులు మీ ప్రయాణ బడ్జెట్‌ను సైలెంట్​గా పెంచుతాయి. కాబట్టి బడ్జెట్ ఎయిర్‌లైన్స్ పెద్ద బ్యాగులకు అదనంగా వసూలు చేస్తాయి. దీని వలన టికెట్ తక్కువే అయినా వీటితో ఖరీదైనదిగా మారుతుంది. కాబట్టి క్యాబిన్ లగేజీతో మాత్రమే ప్రయాణించడం వల్ల అధిక ఖర్చులను నివారించవచ్చు. కాబ్టటి స్మార్ట్‌గా ప్యాక్ చేయండి. దీనివల్ల బ్యాగేజీ క్లెయిమ్ సమయంలో సమయం ఆదా అవుతుంది.

ప్రజా రవాణా బెస్ట్..

టాక్సీలు, రైడ్-షేరింగ్ యాప్‌లు మీ బడ్జెట్‌ను పెంచేస్తాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఉన్నప్పుడు మీరు వీటికి బదులుగా మెట్రోలు, బస్సులు, లోకల్ ట్రైన్స్, ట్రామ్లు ఎంచుకోవచ్చు. తక్కువ ఖర్చులో ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. అనేక నగరాలు నిర్ణీత ధరకు అపరిమిత రైడ్‌లను అందించే టూరిస్ట్ ట్రావెల్ కార్డులను అందిస్తాయి. నడక అనేది మరొక ట్రావెల్ హ్యాక్. ఇది డబ్బును ఆదా చేస్తుంది. అలాగే మీకు కొత్త వ్యక్తులను, కొత్త ప్లేస్​లను చూసే ఆప్షన్ కల్పిస్తుంది.

స్టేయింగ్ కోసం..

హోటళ్లకు బదులుగా మీరు హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, హోమ్‌స్టేలు లేదా స్వల్పకాలికంగా ఇచ్చే అద్దె అపార్ట్‌మెంట్‌లు ఎంచుకోవచ్చు. హాస్టళ్లు హోటల్ ధరల కంటే తక్కువ ధరకే అద్భుతమైన సౌకర్యాలతో ప్రైవేట్ గదులను అందిస్తాయి. నగరానికి కాస్త వెలుపల బస చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మీకు దగ్గర్లో బస్​స్టాప్స్, మెట్రోలు ఉండేలా తీసుకుంటే మరీ మంచిది. అలాగే రివ్యూలు చూసి తీసుకుంటే సేఫ్టీ కూడా ఉంటుంది.

ఫుడ్ విషయంలో..

పర్యాటక ప్రదేశాలలో హోటల్స్​లో భోజనం చాలా ఎక్కువ ధరకు ఉంటుంది. కాబట్టి దానికి బదులుగా స్థానిక మార్కెట్లలో, స్ట్రీట్ ఫుడ్స్​, లోకల్ రెస్టారెంట్లలో తింటే తక్కువలో టేస్టీగా, వివిధ వంటకాలు ప్రయత్నించవచ్చు. ఆహారం ప్రయాణంలో ప్రధాన భాగం. కానీ తెలివైన ఎంపికలు ద్వారా బడ్జెట్‌కు అనుకూలంగా మార్చుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ బుకింగ్స్

అనేక టూరింగ్ స్పాట్స్.. ఆన్-సైట్ కొనుగోళ్లతో పోలిస్తే.. ఆన్‌లైన్ టిక్కెట్లపై డిస్కౌంట్స్ ఇస్తాయి. కాబట్టి ముందుగానే వాటిని బుక్ చేసుకోవడం వల్ల క్యూలు అవాయిడ్ చేయవచ్చు. అలాగే ధరల పెరుగుదలను నివారించవచ్చు. తక్కువ ధరల్లోనే ఎక్కువ చూడగలిగే సిటీ పాస్‌ల కోసం చూడండి. కొన్ని మ్యూజియంలు, ల్యాండ్‌మార్క్‌లు కొన్ని రోజుల్లో ఉచిత ప్రవేశాన్ని కూడా అందిస్తాయి. మీ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుని వాటిని విజిట్ చేయవచ్చు.

ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌

మీరు తరచుగా ప్రయాణిస్తుంటే.. రివార్డ్ ప్రోగ్రామ్‌లు ఖర్చులను గణనీయంగా తగ్గించగలవు. ఎయిర్‌లైన్ మైళ్లు, హోటల్ లాయల్టీ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ట్రావెల్ కార్డులు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. సైన్-అప్ బోనస్‌లు, ప్రమోషనల్ ఆఫర్‌ల నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు. అయితే క్రెడిట్‌ కార్డ్​ను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే రివార్డ్స్ పొందవచ్చు. 

కరెన్సీ మార్పిడి

విమానాశ్రయ కరెన్సీ మార్పిడి కౌంటర్లు ఎక్కువ రేట్లకు ఇస్తాయి. దానికి బదులుగా స్థానిక ATMల నుంచి డబ్బును తీసుకోండి. లేదా తక్కువ విదేశీ లావాదేవీల రుసుములతో అంతర్జాతీయ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించండి. అనవసరమైన రుసుముల నుండి మీ డబ్బును రక్షించుకోవడం కోసం బడ్జెట్ ప్రయాణ ప్రణాళిక చేసుకోవాలి. 

నెమ్మదైన ప్రయాణం

వేగవంతమైన ప్రయాణం తరచుగా అధిక ఖర్చులకు, ఎక్కువ రవాణా టిక్కెట్లు, ఎక్కువ భోజనం, ఎక్కువ ఖర్చులకు దారితీస్తుంది. కాబట్టి స్లో ట్రావెల్ చేయవచ్చు. దీనివల్ల మెరుగైన వసతులు తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడు భోజనం వండుకోండి. ఒకే చోట ఎక్కువసేపు ఉండటం వల్ల రోజువారీ రవాణా ఖర్చులు తగ్గుతాయి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget