అన్వేషించండి

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

Study On Blood Pressure : బీట్‌రూట్ జ్యూస్ తాగిన తర్వాత.. చూయింగ్ గమ్ నమలడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా తగ్గుతుందని తాజా అధ్యనం తెలిపింది. దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నైట్రేట్ అధిక ఆహారం, చక్కెర గమ్ తాత్కాలికంగా రక్తపోటు తగ్గిస్తాయి.
  • నోటి బ్యాక్టీరియా నైట్రేట్లను నైట్రైట్‌లుగా మార్చి బీపీ నియంత్రిస్తుంది.
  • చక్కెర గమ్ సిస్టోలిక్ 3 mmHg, డయాస్టోలిక్ 2 mmHg తగ్గించింది.
  • ఈ ప్రభావం తాత్కాలికమే, ఎక్కువ చక్కెర గమ్ వాడకం దంతాలకు హానికరం.

Beetroot Chewing Gum Combination : ఈ రోజుల్లో అధిక రక్తపోటు (బీపీ) సమస్య సర్వసాధారణమైపోయింది. దానిని కంట్రోల్ చేయడానికి ప్రతిరోజూ మందులు తీసుకోవడంతో పాటు.. తాము తినే, తాగే వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇటీవల జరిగిన ఒక కొత్త, విలక్షణమైన పరిశోధనలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అదేటంటే.. పరిశోధకుల ప్రకారం బీట్‌రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత చక్కెర కలిపిన చూయింగ్ గమ్ తింటే అధిక రక్తపోటును కొంతకాలం నియంత్రించవచ్చు.

నైట్రేట్లకు, రక్తపోటుకు మధ్య సంబంధం ఇదే..

బీట్‌రూట్, పాలకూర, కేల్ వంటి కూరగాయలలో సహజంగా నైట్రేట్ అనే మూలకం ఉంటుంది. అయితే మన శరీరం ఈ నైట్రేట్‌ను నేరుగా ఉపయోగించుకోలేదు. అందువల్ల మన నోటిలోని బ్యాక్టీరియా మొదట దానిని నైట్రైట్గా మారుస్తుంది. నైట్రైట్‌గా ఏర్పడిన తర్వాత అది రక్తనాళాలను సడలించి.. వెడల్పు చేస్తుంది. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, రక్తపోటు తగ్గుతుంది.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

బీట్‌రూట్ జ్యూస్, చూయింగ్ గమ్​తో పరిశోధన

లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ ఆండ్రూ వెబ్, అతని బృందం ఆరోగ్యవంతులపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ముందుగా అధ్యయనంలో పాల్గొన్న ప్రజలందరికీ బీట్‌రూట్ రసం ఇచ్చారు. తరువాత వారిని 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపుకు చక్కెర ఉన్న చూయింగ్ గమ్, మరియు మరొక గ్రూపునకు చక్కెర లేని చూయింగ్ గమ్ ఇచ్చారు. దీనిని 3 నుంచి 6 గంటల పాటు నమలడానికి ఇచ్చారు. ఈ సమయంలో వారి రక్తం, లాలాజలం, రక్తపోటు స్థాయిలను పరిశీలించారు. వారం తర్వాత కూడా అదే ప్రయోగాన్ని పునరావృతం చేశారు. కానీ ఈసారి రెండు బృందాలకు చూయింగ్ గమ్‌ను మార్చారు.

పరిశోధన ఫలితం ఇదే

ఈ అధ్యయనంలో చక్కెర ఉన్న గమ్ నమిలే వారి నోటిలో లాలాజల ఆమ్లత్వం పెరిగినట్లు కనుగొన్నారు. pH స్థాయి 1.4 పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు. దీని కారణంగా వారి నోటిలో నైట్రైట్ పరిమాణం 45 శాతం అధికంగా, వారి శరీరంలో 25 శాతం అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఫలితంగా వారి సిస్టోలిక్ రక్తపోటు సుమారు 3 mmHg, డయాస్టోలిక్ రక్తపోటు 2 mmHg తగ్గినట్లు గుర్తించారు. 

Also Read : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?

అధిక రక్తపోటుకు ఇది శాశ్వత చికిత్సా?

అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్రతిరోజూ చక్కెర చూయింగ్ గమ్ నమలడం ప్రారంభించాలని ఈ పరిశోధన అర్థం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ చూయింగ్ గమ్ ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఎక్కువసేపు చక్కెర చూయింగ్ గమ్ నమలడం వల్ల దంతాలు దెబ్బతినడమే కాకుండా జీవక్రియపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. 

Also Read : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tips to Manage Daily Stress : స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
స్ట్రెస్ తగ్గించుకుని సంతోషంగా ఉండాలా? అయితే ఈ 5 చిట్కాలు తప్పక ఫాలో అవ్వండి
Omelette Curry : 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
Heart Attack vs Cardiac Arrest : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Advertisement

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
TMC symbol frozen : మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Embed widget