అన్వేషించండి

Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

Doctor Vikrant Singh Eating Habits : డాక్టర్ విక్రాంత్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ గురించి వీడియో చేశారు. దీనిని ఫాలో అవ్వడం వల్ల తన బీపీ, షుగర్ కంట్రోల్ అయిందని తెలిపారు. మరి నిపుణులు ఏమంటున్నారంటే

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డాక్టర్ విక్రాంత్ ఆరేళ్లుగా లోకార్బ్ డైట్ పాటిస్తున్నారు.
  • బీపీ, షుగర్ నియంత్రణకు ఇది సహాయపడిందంటున్నారు.
  • అయితే, ఈ డైట్ వైద్య సలహా తర్వాతే అనుసరించాలని సూచించారు.
  • ఫైబర్ ఆరోగ్యం, జీవక్రియలకు చాలా ముఖ్యమని నిపుణులు తెలిపారు.

Dr. Vikrant Singh 6-Year Diet Routine : డాక్టర్ విక్రాంత్ సింగ్ చాలామంది తెలుగు వారికి తెలిసిన ఫేమస్ డాక్టర్. కరీంనగర్​కు చెందిన వారే అయినా.. ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఎక్కువమందికి రీచ్ అయ్యారు. ఆయన ఇచ్చే హెల్త్ టిప్స్, వంట నూనె గురించి ఆయన చేసే రీల్స్​ చాలా వైరల్ అయ్యాయి. తీసుకునే ఆహారం, డ్రింక్స్, లైఫ్ స్టైల్​ గురించి పలు సూచనలు చేసే ఆయన.. తాజాగా ఆయన డైలీ ఏమి తింటారో తెలిపారు. మరి ఈ డాక్టర్ ఫాలో అయ్యే డైట్ ఏంటో.. ఆయనకు ఎలాంటి ప్రయోజనాలు లభించాయో.. దీనిని ఎవరు ఫాలో అవ్వాలో, అవ్వకూడదో చూసేద్దాం.

డాక్టర్ విక్రాంత్ డైట్..

డాక్టర్ విక్రాంత్ ఆస్పత్రికి వచ్చే ముందు.. 11 గంటల సమయంలో కొంచెం అన్నం.. ఎక్కువ కూర, ఎక్కువ పెరుగు తింటారని తెలిపారు. పైగా కూర కూడా నాన్​వెజ్ తింటారట. నేను నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ కాదు కాబట్టి పుష్కలంగా నాన్​వెజ్ తింటాను. వెజిటెబుల్స్ తినను. అవి నాకు పడవు అని చెప్పారు. తక్కువ అన్నంలో ఎక్కువ కూర.. ఎక్కువ పెరుగు వేసుకుని మాత్రమే తింటాను. అంతే. మళ్లీ రాత్రి మూడు లేదా నాలుగు ఉడికించిన కోడిగుడ్లు తింటాను. లోపలి పూర్ణంతో సహా తింటాను అని తెలిపారు. రోజు మొత్తంలో ఆయన ఇవే తింటారట. అలాగే ఉదయాన్నే పరగడుపుతో బ్లాక్ కాఫీ తాగుతారట. అదీ కూడా షుగర్ లేకుండా నెయ్యి వేసుకుని. 

ఆరేళ్లుగా ఇదే డైట్

నేను తినేది ఇది. అందరూ ఇవే తినమని చెప్పట్లేదని అదే వీడియోలో తెలిపారు డాక్టర్ విక్రాంత్. అంతేకాకుండా దీనిని 6 ఏళ్లుగా కంటిన్యూ చేస్తున్నానని.. దీనిని ఫాలో అవ్వడం వల్ల బీపీ, షుగర్ అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఇలా తింటే బరువు పెరగరు, వీక్​నెస్ రాదు అని తెలిపారు. కానీ దీనినే ఫాలో అవ్వాలనకుంటే మాత్రం కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సిందేనని సూచించారు. 

డాక్టర్ విక్రాంత్​ డైట్​పై ఫిట్​నెస్ నిపుణులు ఏమంటున్నారంటే.. 

డాక్టర్ విక్రాంత్ షేర్ చేసిన ఈ డైట్​ గురించి సెలబ్రెటీ ఫిట్నెస్ కోచ్ విశ్వ రెస్పాండ్ అయ్యారు. డాక్టర్ తీసుకునేది లోకార్బ్ డైట్ అని.. మీ డైట్లో నుంచి ఒకేసారి కార్బ్ పూర్తిగా తీసేశారో అప్పుడు వాటర్ లాస్, వెయిట్ లాస్ జరుగుతుందని తెలిపారు. అలాగే డాక్టర్ తన ప్రీడయాబెటిస్, బీపీ రివర్స్ అయిందన్నారు.. దాని గురించి చెప్పాలంటే పరిశోధనల ప్రకారం.. మీరు బరువు కాస్త తగ్గితే.. బీపీ, షుగర్ అనేవి కంట్రోల్ అవుతాయని తెలిపారు. అంత మాత్రాన దీనిని అందరూ ఫాలో అవ్వకూడదని తెలిపారు విశ్వ. 

ఫైబర్ తీసుకుంటే మరీ మంచిది

ఫిట్​నెస్ కోచ్​గా ఇలాంటి డైట్ ఫాలో అయ్యేవారికి నేను ఇచ్చే సూచన ఏదైనా ఉంది అంటే.. అది ఫైబర్ అని తెలిపారు. డాక్టర్ ఫైబర్ తనకి అవసరం లేదు తినను అంటున్నారు కానీ.. మన డైట్​లో కచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలని విశ్వ తెలిపారు. స్టడీల ప్రకారం ఫైబర్ తీసుకుంటే మెటబాలీజం పెరుగుతుందని తెలిపారు. ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం ఒకటే కాదు.. హార్ట్ హెల్త్, గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుందని వివరించారు. 

డాక్టర్ విక్రాంత్​ బాడీకి సెట్ అయినట్లు ఈ డైట్ అందరికీ సెట్ కాదని.. లిమిటెడ్​గా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపారు విశ్వ. ఈ ఫైబర్ కూడా డాక్టర్ తన డైట్లో యాడ్ చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు చూడగలుగుతారని సూచించారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget