Healthy Food for Weight Loss : బరువు తగ్గడంలో హెల్ప్ చేసే హెల్తీ ఫుడ్స్.. ప్రోటీన్, ఫైబర్ నుంచి కార్బ్స్ వరకు
Weight Loss Food List : బరువు తగ్గడంలో.. హెల్తీ బరువు మెయింటైన్ చేయడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తూ.. హెల్తీగా బరువు తగ్గడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ లిస్ట్ చూసేద్దాం.

Food Sources For Weight Loss : బరువు తగ్గడానికి ఎన్ని వ్యాయామాలు చేసినా.. హెల్తీ డైట్ మెయింటైన్ చేయకుంటే ఆరోగ్యం సహకరించదు. పైగా చాలామంది బరువు తగ్గడానికి ఫుడ్ తీసుకోవడం మానేస్తారు. అది చాలా పెద్ద తప్పు. హెల్తీగా బరువు తగ్గాలనుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించాలి. దానికి బ్యాలెన్స్డ్ డైట్ పర్ఫెక్ట్. అయితే సమతుల్య ఆహారం తీసుకోవాలంటే దానిలో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, కార్బ్స్ ఉండేలా చూసుకోవాలి.
హెల్తీగా బరువు తగ్గాలనుకున్నప్పుడు ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్, కార్బ్స్‌ని కచ్చితంగా శరీరానికి అందించాలి. అయితే ఈ పోషకాలు కోసం మీరు ఎలాంటి ఫుడ్స్‌ని ట్రై చేస్తే మంచిది. ప్రోటీన్‌కు మంచి సోర్స్ ఏంటి? హెల్తీ కార్బ్స్ వేటి నుంచి పొందవచ్చు. ఫ్యాట్స్‌ని ఎలా తీసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ప్రోటీన్ కోసం..
ప్రోటీన్ హెల్తీగా బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది కండరాలను బిల్డ్ చేయడంలో సహాయం చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గే సమయంలో మీకు మజిల్ లాస్ ఉండదు. అందుకే ప్రోటీన్ కోసం.. పనీర్, చియాసీడ్స్, శనగలు తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే నాన్ వెజ్ తినేవారు చికెన్ తీసుకోవచ్చు. చికెన్ బ్రెస్ట్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఎగ్స్ కూడా హెల్తీ ప్రోటీన్ సోర్స్‌గా తీసుకోవచ్చు.
ఫైబర్
శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు.. లోపలున్న టాక్సిన్లను బయటకు పంపి.. మెటబాలీజం పెంచడంలో ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే మీ ప్రతీ మీల్లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలని చెప్తారు. అయితే ఓట్స్, చిలగడ దుంప, కిడ్నీ బీన్స్, ఫ్రూట్స్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
హెల్తీ ఫ్యాట్స్
ఫ్యాట్స్ తీసుకుంటే బరువు పెరిగిపోతామనుకునేవారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఫ్యాట్స్ రెండు రకాలు. అవి హెల్తీ ఫ్యాట్స్, అన్ హెల్తీ ఫ్యాట్స్. ప్యాక్డ్, డీప్ ఫ్రై చేసిన స్పైసీ ఫుడ్ ద్వారా అన్‌హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ పెంచి.. గుండె సమస్యలను పెంచుతాయి. హెల్తీ ఫ్యాట్స్ అలా కాదు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసి.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అందుకే హెల్తీ ఫ్యాట్స్ డైట్లో ఉండాలి. వాటికోసం బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, సీడ్స్, అవకాడోలను డైట్లో చేర్చుకోవచ్చు.
కార్బ్స్
కార్బ్స్ బరువు పెరిగేలా చేస్తాయి. అందుకని మొత్తానికి వాటిని అవాయిడ్ చేయకూడదు. అవి శరీరానికి అవసరమేనని గుర్తించాలి. అయితే వాటిని ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో శరీరానికి అందించవచ్చు. ఆరోగ్యానికి మేలు చేస్తూ.. లో కార్బ్ డైట్ తీసుకోవాలనుకుంటే బ్రకోలీ, క్యాబేజీ, మష్రూమ్, కీరదోసలను కార్బ్ పోర్షన్లో తీసుకోవచ్చు.
మీరు తీసుకునే సమతుల్య ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తీసుకోండి. అస్సలు వ్యాయామం చేయలేనివారు తేలికపాటి వ్యాయామం చేసినా మంచి ఫలితాలు ఉంటాయని గుర్తించుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















