అన్వేషించండి

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు

SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.

Telangana Phone tapping case: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన  ఫోన్ ట్యాపింగ్ కేసు* దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలో కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ గుర్తించారు. ఈ మేరకు సమాచారం తెలుసుకనేందుకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి పలుమార్లు చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడ్ని విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. 
 
 గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి, ఆ సమాచారాన్ని రాజకీయ లబ్ధికి వాడుకున్నారనే అభియోగాలపై సిట్ తన దూకుడును పెంచింది. ఎస్ఐబీ (SIB) మాజీ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు , ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) నివేదికల ఆధారంగా కీలక రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేస్తున్నారు. కొండల్ రెడ్డితో పాటు  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్య  కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లకు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ,  2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిందితులతో వీరు జరిపిన సంభాషణలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

కేవలం నాయకులే కాకుండా, వారి కుటుంబ సభ్యులు , సన్నిహితులను కూడా ప్రశ్నిస్తున్నారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి  కొండల్ రావు కు, అలాగే కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు  మాధవరం సందీప్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అక్రమంగా సేకరించిన సమాచారాన్ని వీరు ఏమైనా వినియోగించుకున్నారా? లేదా అధికారులకు నంబర్లను చేరవేయడంలో వీరి పాత్ర ఉందా? అనే కోణంలో సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి  ప్రభాకర్ రావు  ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట  విచారణకు హాజరయ్యారు.  ఆయన కస్టడీ విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగానే ఈ నోటీసుల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల కదలికలను గమనించడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చిన నేతలెవరు? అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ నవీన్ రావును ఇప్పటికే సుదీర్ఘంగా విచారించిన అధికారులు, త్వరలోనే మరికొందరు మాజీ మంత్రులు,  కీలక నేతలకు కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. సాంకేతిక ఆధారాలతో పాటు నిందితుల కాల్ డేటా రికార్డులను (CDR) విశ్లేషిస్తున్న అధికారులు, ఈ నెలాఖరులోగా కీలకమైన ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో సాగుతున్న ఈ విచారణలో ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.                                              

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget