రోజును హెల్తీ బ్రేక్​ఫాస్ట్​తో ప్రారంభిస్తే.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

అందుకే ఎలాంటి ఆహారం తీసుకుంటే గుండె ఆరోగ్యంతో పాటు బరువును తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

బాదం రాత్రుళ్లు నానబెట్టుకుని ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. బరువు కూడా తగ్గుతారు.

చియాసీడ్స్​ని సలాడ్స్ పైన లేగా నీటిలో కలిపి తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్​గా ఉంటారు. గుండెకు మంచిది.

మిల్లెట్స్, కూరగాలయతో నిండిన బ్యాలెన్స్డ్ బ్రేక్​ఫాస్ట్ కూడా ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది.

కిమ్చీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ వంటి వాటిని కూడా మీ డైట్​లో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ అందుతుంది. బరువు తగ్గొచ్చు.

అవకాడోని బ్రేక్​ఫాస్ట్​గా, టోస్ట్​కి తోడుగా తీసుకోవచ్చు. దీనిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

పాలకూరను స్మూతీగా తీసుకున్నా, సలాడ్స్​లో తీసుకున్నా ఆరోగ్యానికి, స్కిన్, హెయిర్​కి ఎంతో మేలు చేస్తుంది.

బ్లూ బెర్రీలు ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ వీటిని తింటే చాలామంచిదట.

క్యారెట్స్​ని ఉడకబెట్టి బ్రేక్​ఫాస్ట్​గా లేదా హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు. రుచికోసం గార్నిష్ చేసుకోవచ్చు.