కేదార్ నాథ్ ఆలయం ఎన్నో వేల సంవత్సరాలుగా హిందూ తీర్థయాత్రలో భాగంగా ఉంది.

శివుడి జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని భక్తులు నమ్ముతారు.

ఈ ఆలయం సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని ఎత్తైన దేవాలయాల్లో ఇది ఒకటి.

ఆలయాన్ని చేరుకోవడానికి 16 కి.మీ ట్రెక్కింగ్ చేయాలి. సవాలుతో కూడుకున్న ఆధ్యాత్మిక ప్రయాణం ఇది.

ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని నిర్మించారు.

భారీ హిమపాతం కారణంగా చలికాలంలో ఆలయాన్ని మూసేస్తారు. విగ్రహాన్ని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు.

చార్​ ధామ్ యాత్రలో భాగంగా భక్తులు కేదార్​నాథ్ వస్తారు. కేదార్​నాథ్ శివయ్యకు, బద్రీనాథ్ విష్ణువుకు అంకితం.

హిందూ పురాణాల ప్రకారం.. కేదార్​నాథ్ శివుని అవతార స్థలంగా భక్తులు భావిస్తారు. పంచ కేదారోలో ఇది ఒక భాగం.

జూన్ 2013లో వచ్చిన భారీ వర్షాలు, వరదల సమయంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆలయం అలాగే ఉంది.

కేదార్​నాథ్ యాత్ర మోక్షానికి మార్గంగా భక్తులు నమ్ముతారు. పాపాల నుంచి విముక్తి పొందుతారని చెప్తారు.