సమ్మర్​లో బయటకు వెళ్లితే చాలు ఈజీగా టాన్ అయిపోతారు. అయితే కొన్ని చిట్కాలతో దానిని ఈజీగా వదిలించుకోవచ్చు.

టాన్​ని ఎక్కువరోజులు వదిలేస్తే అది పూర్తిగా మీ శరీరంలో ఇంకిపోతుంది. దానిని వదిలించుకోవడం చాలా కష్టం.

పసుపులో నిమ్మరసం పిండి.. దానిని ముఖానికి అప్లై చేస్తే టాన్ ఈజీగా వదిలిపోతుంది.

కీరదోస గుజ్జును పెరుగులో కలిపి ముఖానికి మాస్క్​గా అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితాలుంటాయి.

అలోవెరా జెల్​ని నేరుగా ముఖానికి అప్లై చేయడం ద్వారా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కలబంద ఫ్రెష్​ది అయితే మరీ మంచిది.

బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్​గా అప్లై చేసి.. దానిని కడిగేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

టోమాటోను ముక్కగా కోసి.. దానిని ముఖంపై రబ్ చేసినా కూడా టాన్ ఈజీగా వదిలిపోతుంది.

కాఫీ పొడిలో, కొబ్బరినూనె, పంచదార కలిపి అప్లై చేసి స్క్రబ్ చేసినా మంచి ఫలితాలుంటాయి.

టాన్ రాకుండా ముందుగానే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖానికి ఫేస్ మాస్క్, స్కార్ఫ్ కట్టుకుని కాపాడుకోవచ్చు.

ఎండలో బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా సన్​స్క్రీన్​ని అప్లై చేయాలి. ఇది బెస్ట్ ఫలితాలు ఇస్తుంది.