కళ్లను కాపాడుకోవాలన్నా.. కంటిచూపు మందగించకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

దానిలో 20-20-20 రూల్ ఒకటి. ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్​కి దూరంగా చూడాలని గుర్తించుకోండి.

20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూసేందుకు ట్రై చేయండి.

కళ్లను 20 సార్లు గట్టిగా మూసి, తెరవండి. ఇది కంటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

బయటకు వెళ్లినప్పుడు యూవీ ప్రొటెక్షన్ కోసం సన్​గ్లాసెస్​ పెట్టుకోండి. ఇవి కళ్లకు రక్షణ ఇస్తాయి.

గుడ్ లైటింగ్ ఉండేలా రూమ్​ని సెట్​ చేసుకోండి. వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశంలో చదవకపోవడం, వర్క్ చేయకపోవడమే మంచిది.

మీరు ఉపయోగించే కంప్యూటర్​ను కంటికి సరైన దూరంలో.. 90 డిగ్రీల కోణంలో ఉండేలా సెట్ చేసుకోండి.

కళ్లు ఇరిటేషన్​ వస్తున్నప్పుడు దానిని గట్టిగా రుద్దకపోవడమే మంచిది.

రెగ్యులర్​గా కంటికోసం మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి.

హైడ్రేటెడ్​గా ఉండేందుకు నీటిని తాగాలి. ఇది కంటి ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.