అన్వేషించండి

Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu : గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకోవచ్చని చంద్రబాబు అన్నారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయయని.. నీటితో రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు పరిశీలించారు.

Godavari Water: నీళ్లపై రాజకీయాలు చేయడం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద జల వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లపై పోటాపోటీగా మాట్లాడటం సరి కాదన్నారు. తెలంగాణ గోదావరి నీటిని మంజీరాకు మళ్లించినప్పుడు కూడా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్నారు. నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేయవద్దని, సముద్రంలో కలిసే నీటిని ఎవరైనా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. తెలుగు జాతి ఒక్కటేనని, ఇరు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి తప్ప భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తానే మహబూబ్‌నగర్‌కు జూరాల నుంచి నీళ్లిచ్చానని, దేవాదుల, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను ప్రారంభించానని గుర్తు చేస్తూ, ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయాలే తప్ప విరోధాలు పెంచకూడదని ఆయన సూచించారు.

 

నీటి విషయంలో గొడవలు పడటం వల్ల రెండు రాష్ట్రాలూ నష్టపోతాయని, సామరస్య పూర్వక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం , నీటి లభ్యతపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.  గోదావరి మిగులు జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాయలసీమతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా మేలు జరుగుతుందని బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. విభజన సమస్యలు ఉన్నప్పటికీ, సాగునీటి విషయంలో మొండివైఖరి ప్రదర్శించకుండా, ఉమ్మడి ప్రయోజనాల కోసం అడుగులు వేయాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.  

పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదని, ఇది దేశానికే గర్వకారణమైన బహుళార్థసాధక ప్రాజెక్టు అని ఆయన నొక్కి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల ఆలస్యం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా, రాష్ట్ర రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు  విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.       

వరదల సమయంలో లోతట్టు ప్రాంతాలకు,  సరిహద్దు రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా శాస్త్రీయంగా మేనేజ్‌మెంట్ చేస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో కరువు అనేది ఉండదని, గోదావరి జలాలను ఒడిసి పట్టడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.                                       

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget