అన్వేషించండి

Happy Hormones : ఒత్తిడిని తగ్గించి, హ్యాపీగా ఉంచే హార్మోన్లు ఇవే.. లైంగిక ఆరోగ్యానికి కూడా చాలా మంచివట

Natural Happiness Boosters : కొన్ని హార్మోన్లు బాధను, ఒత్తిడిని దూరం చేసి ఆనందంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా నాలుగు హార్మోన్లు మానసికంగా, శారీరకంగా మంచివని చెప్తున్నారు. అవేంటంటే..

Mood-Boosting Hormones : శారీరక, మానసిక ప్రయోజనాలు అందించడంలో హార్మోన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని హార్మోన్లు ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని హార్మోన్లు ఆరోగ్యాన్ని అందించి.. హ్యాపీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఆనందాన్నిచ్చే నాలుగు ప్రధానమైన హార్మోన్లు ఉన్నాయి. వాటిని శరీరంలో ఎలా పెంచుకోవచ్చు.. వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

డోపమైన్ (Dopamine), ఆక్సిటోసిన్ (Oxytocin), సెరోటోనిన్ (Serotonin), ఎండార్ఫిన్స్ (Endorphins) అనే నాలుగు ప్రధానమైన హార్మోన్లను హ్యాపీ హార్మోన్లు అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంతకీ ఈ హార్మోన్లతో కలిగే లాభాలు ఏంటి? ఏ పనులు చేస్తే అవి విడుదల అవుతాయో ఇప్పుడు చూసేద్దాం. 

డోపమైన్ (Dopamine)

శరీరంలో డోపమైన సరైన మోతాదులో విడుదల అయితే.. మీకు మంచి మోటీవేషన్ అందుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంపై, పనిపై ఫోకస్ చేసేలా మైండ్​ని ప్రేరేపిస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. లైంగిక ఆరోగ్యానికి మంచిది. సెక్సువల్ డ్రైవ్​ని మెరుగుపరుస్తుంది. మూడ్​, ఫీలింగ్స్​ని పెంచడంతో పాటు.. తృప్తిని అందిస్తుంది.

బూస్టింగ్ టిప్స్ : వ్యాయామం చేయడం, నచ్చిన మ్యూజిక్ వినడం, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల డోపమైన్ విడుదల అవుతుంది. ఫోన్​ వాడకం తగ్గినప్పుడు, ఇంటిని శుభ్రం చేసినప్పుడు, చల్లని నీటితో స్నానం చేసినప్పుడు కూడా ఇది విడుదలవుతుంది. 

ఆక్సిటోసిన్ (Oxytocin)

ఆక్సిటోసిన్​ని లవ్ హార్మోన్​గా చెప్తారు. ఇది బంధాలు, నమ్మకం, రిలేషన్​ షిప్​లలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎమోషనల్​గా, ఫిజికల్​గా కనెక్షన్​ని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంగ్జైటీని దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. 

బూస్టింగ్ టిప్స్ : ఆక్సిటోసిన్ హార్మోన్ హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం, నచ్చిన వ్యక్తికి శారీరకంగా దగ్గరగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. అలాగే ప్రేమించిన వ్యక్తులకు దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ బూస్ట్ అవుతుంది.  

సెరోటోనిన్ (Serotonin) 

మూడ్​ని స్టెబులైజ్ చేయడంలో సెరోటోనిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అవుతాయి. మానసికంగా ఆరోగ్యంగానూ.. సంతోషంగానూ ఉంటారు. డిప్రెషన్​ని, యాంగ్జైటీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. ఎమోషనల్​గా స్ట్రాంగ్​గా ఉండేలా చేసి.. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి కలిగిస్తుంది.

బూస్టింగ్ టిప్స్ : సన్​ లైట్​లో గడపడం, హెల్తీ డైట్ తీసుకోవడం, వ్యాయామం, మెడిటేషన్ చేయడం వల్ల శరీరంలో సెరోటోని విడుదల అవుతుంది. బ్రీతింగ్ వ్యాయామాలు, మంచి నిద్ర కూడా ఈ హార్మోన్​ని బూస్ట్ చేస్తుంది. 

ఎండార్ఫిన్స్ (Endorphins) 

ఎండార్ఫిన్స్​ని పెయిన్ కిల్లర్స్ అంటారు. ఇవి నొప్పి నుంచి ఉపశమనం అందించడంతో పాటు లైంగిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శారీరకంగా, మానసికంగా కలిగే బాధను దూరం చేయడంలో ఎండార్ఫిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పాజిటివ్ ఫీలింగ్స్​ని పెంచుతాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. శక్తిని పెంచుతాయి. 

బూస్టింగ్ టిప్స్ : వ్యాయామం చేసినప్పుడు, డార్క్ చాక్లెట్ తిన్నప్పుడు, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు శరీరంలో ఇది సహజంగా విడుదల అవుతుంది. పాటలు పాడినా, శరీరాన్ని స్ట్రెచ్ చేసినా.. ఇది బూస్ట్ అవుతుంది. 

ఈ హార్మోన్లు అన్ని బాధను, ఒత్తిడిని తగ్గించి సంతోషంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి. శారీరకంగా, మానసికంగానే కాకుండా లైంగిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వీటిని శరీరం పెంచుకునేలా డైలీ రొటీన్ ప్లాన్ చేసుకుంటే మొత్తం ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget