Health Destroying Habits : ఆరోగ్యాన్ని, శరీరాన్ని నాశనం చేసే అలవాట్లు ఇవే.. యూరిన్ ఆపుకోవడం నుంచి ఫోన్ అక్కడ పెట్టడం వరకు, ఈ మిస్టేక్స్ వద్దు
Bad Habits : కొన్ని అలవాట్లు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ రొటీన్ అలవాట్లు ఏంటో.. అవి చేసే డ్యామేజ్ ఏంటో చూసేద్దాం.

Unhealthy Habits : ఏం పర్లేదనుకుని చేసే కొన్ని అలవాట్లు ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. తెలిసి తెలిసి చేసే ఈ మిస్టేక్స్ ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా నెగిటివ్ ప్రభావాలను చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటి? వాటి వల్ల శరీరానికి, ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం.
యూరినేషన్..
కొందరు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే యూరినేషన్ని ఆపేసుకోవడం. పని ఉందనో.. లేకుంటే తర్వాత వెళ్దాములే అని బద్ధకించో.. ఇతర కారణాలతో మూత్రాన్ని కంట్రోల్ చేసుకుంటారు. బ్లాడర్ ఫుల్ అయినప్పుడు కచ్చితంగా వాష్ రూమ్‌కి వెళ్లాలి. లేట్ చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు రిపీటెడ్‌గా ఈ తప్పు చేస్తే కిడ్నీ సమస్యలు వస్తాయి.
మెటికలు..
చిన్న పని చేసినా.. లేదా ఖాళీగా ఉన్నప్పుడు.. లేదా ఫన్ మోడ్‌లో ఉన్నప్పుడు చాలామంది మెటికలు విరుస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. కానీ మెటికలు విరచడం అనేది అస్సలు మంచిది కాదట. ఎక్కువకాలం ఇలా మెటికలు విరిస్తే జాయింట్స్ వీక్ అవుతాయని చెప్తున్నారు.
నో నీరు..
హైడ్రేషన్ శరీరానికి చాలా ముఖ్యం. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా నీటిని తాగితే మంచిది. కానీ భోజనం చేస్తున్నప్పుడు మాత్రం నీటిని తాగవద్దని చెప్తున్నారు నిపుణులు. భోజనానికి ముందు లేదా భోజనం అయిన అరగంట తర్వాత నీటిని తాగితే మంచిదని చెప్తున్నారు. అలా కాకుండా ఫుడ్ తింటున్నప్పుడు నీరు తాగితే తీసుకున్న ఆహారం లేట్‌గా జీర్ణమవుతుందని చెప్తున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే జీర్ణ సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు.
ఎక్కువసేపు కూర్చొంటే..
చాలామంది డెస్క్ జాబ్‌లు చేసేవారు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే.. కనీసం డెస్క్ నుంచి కదలక పోవడం. ఇలా ఎక్కువ కాలం కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారు. నడుము నొప్పి వస్తుంది. గుండె సమస్యలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ. అందుకే కనీసం గంటకోసారి లేచి 10 నిమిషాలు వాక్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.
అలా నిద్రపోతే..
మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా? అయితే మీకు త్వరగా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువ. అదే ఎక్కువకాలం పడుకుంటే దీర్ఘకాలిక నడుము నొప్పి సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తాది. అలాగే రైట్ సైడ్ పడుకునే బదులు లెఫ్ట్ సైడ్ పడుకుంటే మంచిదని చెప్తున్నారు. కుడివైపు తిరిగి పడుకుంటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎడమవైపు తిరిగి పడుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు.
ఫోన్ అక్కడ పెడుతున్నారా?
రాత్రుళ్లు పడుకునేందుకు బెడ్ ఎక్కిన తర్వాత కూడా చాలామంది ఫోన్ వాడతారు. అలా వాడి వాడి.. దూరంగా పెట్టకుండా అందుబాటులో ఉంటుందని తలగడ కింద ఫోన్ పెడతారు. ఇలా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందట. అంతేకాకుండా నిద్ర సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. బెడ్‌పై అసలు ఫోన్ లేకుండా చూసుకుంటే మంచిదని చెప్తున్నారు.
ఇవే కాకుండా ఫుడ్ స్కిప్ చేయడం.. ఎక్కువ పంచదార లేదా ఎక్కువ ఉప్పు ఉండే ఫుడ్స్‌ని తినడం కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని చెప్తున్నారు. స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువైనప్పుడు, నీరు శరీరానికి సరిగ్గా అందించకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ చిన్న మిస్టేక్స్ ఎక్కువ కాలం కొనసాగితే ఆరోగ్యానికి ప్రమాదమని చెప్తున్నారు. వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















