Kids Healthy Habits : పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పించాల్సిన 10 అలవాట్లు ఇవే.. ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీ పడకండి
10 Healthy Habits for Kids :పిల్లలు పెరిగే కొద్ది పేరెంట్స్ వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. ఆరోగ్యం విషయంలో రాజీపడకుండా హెల్తీ హ్యాబిట్స్ నేర్పిస్తే అవి వారికి లైఫ్‌లాంగ్ మంచి ప్రయోజనాలిస్తాయి.

Kids Health and Wellness : పిల్లలు త్వరగా రోగాల బారిన పడతారు. వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్లే ఇది జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు. మీ పిల్లలు కూడా ఇలాగే సిక్ అవుతున్నారా? అయితే మీరు వారికి హెల్తీ హ్యాబిట్స్ నేర్పించాల్సిన సమయం వచ్చిందనమాట. అవును పిల్లలకు చిన్నప్పుడే కొన్ని అలవాట్లు నేర్పిస్తే.. వారి ఎదుగుదల బాగుండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో పేరెంట్స్ నేర్పించాల్సిన అంశాలపై నిపుణులు ఇస్తున్న సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
చేతులు శుభ్రం
పిల్లలకు తల్లిదండ్రులు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాటుల్లో మొదటిది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ముఖ్యంగా భోజనానికి ముందు.. భోజనం తర్వాత, వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత, ఆటలు ఆడుకున్న తర్వాత ఇలా ఏ పనిచేసినా వెంటనే చేతులు కడుక్కోవాలని సూచించాలి. దీనివల్ల సగం వైరస్ల వ్యాప్తి తగ్గుతుంది. రోగాల బారిన పడరు.
హెల్తీ ఫుడ్
పిల్లలకు చిన్ననాటి నుంచే పండ్లు, కూరగాయలు, పప్పులు, నట్స్ అలవాటు చేయండి. షుగర్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఇష్టంగా తిన్నా సరే వాటిని లిమిట్ చేయండి. ఆరోగ్యకరమైన ఫుడ్‌ని టేస్టీగా వారికి ఎలా అందించాలో తెలుసుకోండి. స్నాక్స్‌గా ఫ్రూట్స్ లేదా కూరగాయలనే అందించండి.
వ్యాయామం..
పిల్లలతో వ్యాయామం చేయించడం కష్టం కావొచ్చు. కానీ వారిని ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంచేందుకు గేమ్స్ ఆడించవచ్చు. డ్యాన్స్ నేర్పించవచ్చు. లేదంటే సైక్లింగ్, రన్నింగ్ వంటి హ్యాబిట్స్ కచ్చితంగా నేర్పించాలి.
నిద్ర
పిల్లలకు కచ్చితంగా మంచి నిద్ర ఉండేలా బెడ్రూమ్ని ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు కనీసం 8 నుంచి 12 గంటలు పడుకునేలా చూడాలి. వారికి బెడ్ రొటీన్‌ని సెట్ చేసి.. దాని ప్రకారం వారికి నిద్రపోయే వాతావరణాన్ని అందించాలి.
దంత సంరక్షణ
పిల్లలకు దంత సమస్యలు ఎక్కువగా వస్తాయి. స్వీట్స్, చాక్లెట్స్ ప్రభావం వల్ల పిల్లల దంతాలు త్వరగా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి పిల్లలు దంత సంరక్షణ కోసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని చెప్పండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేసే అలవాటు నేర్పించండి.
పనులివ్వండి
పిల్లలకు ఏమి తెలుసు పనులు చెప్పడానికి అనుకోకండి.. వారు చేయగలిగే పనులు చెప్పండి. వారు మిస్టేక్స్ చేస్తుంటే ఇలా చేయకు అని చెప్పండి. పిల్లలతో మొక్కలకు నీరుపోయించడం, వారి బొమ్మలు వారే సర్దుకునేలా చేయడం, విడిచిన డ్రెస్‌లను ఎక్కడ వేయాలో చెప్పడం, వంట చేస్తున్నప్పుడు వారిని కూడా ఇన్వాల్వ్ చేయడం వంటివి చేయాలి.
ఎమోషన్స్
పిల్లలు ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌గా ఉండేలా నేర్పించాలి. వాళ్ల బాధ, సంతోషాన్ని గుర్తించడం, చెప్పడం వంటివి హెల్తీ పద్ధతిలో తెలిపాలి. ఇతరుల పట్ల మంచిగా ఉండడం నేర్పించాలి. పిల్లలు వచ్చి ఏదైనా చెప్పినా పేరెంట్స్ ఓపికగా ఉంటూ.. వారికి మీరు చెప్పే అవకాశం ఇస్తూ ఉండాలి.
చదువు
పిల్లలకి చదువుపై ఆసక్తి కలిగేలా చిన్ననాటి నుంచి బుక్స్‌ని, డ్రాయింగ్స్, పెయిటింగ్స్ వంటివి అలవాటు చేయొచ్చు. వారు చదువుకునేప్పుడు మీరు చేయగలిగే హెల్ప్ ఏంటో గుర్తించాలి. పిల్లలకు ఇష్టమైన సబ్జెక్ట్‌పై మరింత డెప్త్‌గా వెళ్లేందుకు అవకాశం కలిగించాలి. అలాగే పిల్లలను మరీ ప్రెజర్ చేయకూడదు.
నలుగురిలో ఉన్నప్పుడు
ఇది చాలా ముఖ్యమైన అంశం. పిల్లలు ఇంట్లో ఎంత అల్లరి చేసినా.. నలుగురిలో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటున్నారనేది ముఖ్యం. పెద్దలను గౌరవించడం, పిల్లలతో షేర్ చేసుకోవడం, ఇతరులకు హెల్ప్ చేయడం వంటి విషయాలు పేరెంట్స్ నేర్పించాలి.
గ్రాటిట్యూడ్
పిల్లలపై నెగిటివ్ ఇంపాక్ట్స్ పడకుండా చూడాలి. ప్రశాంతంగా ఉండేలా.. ఇతరుల గురించి నెగిటివ్ టాక్స్ పెద్దలు పిల్లలతో మాట్లాడకూడదు. పిల్లలు పాజిటివ్‌గా, గ్రాటిట్యూడ్‌తో ఉండేలా చూసుకోవడం పేరెంట్స్ బాధ్యతే.
చిన్ననాటి నుంచి ఈ హెల్తీ అలవాట్లు పిల్లలకు నేర్పిస్తే పెద్ద అయ్యాక వారు మరింత ప్రొడెక్టివ్గా, హెల్తీగా ఉండడంలో హెల్ప్ అవుతాయి. అలాగే పిల్లలు దాదాపు అన్ని పనులు పెద్దల నుంచి నేర్చుకుంటారు కాబట్టి.. మీరు ఎలాంటి పనులు చేస్తోన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని బిహేవ్ చేయాలి. పిల్లల ముందు కొట్టుకోవడం, ఇతరులను తిట్టడం వంటివి చేయకుండా ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలి.
Also Read : పేరెంట్స్ అలెర్ట్.. మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త, న్యూ రూల్స్‌తో షాక్ ఇవ్వబోతున్న గవర్నమెంట్






















