అన్వేషించండి

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి

Bijapur Encounter:  నిఘా వర్గాల సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన దక్షిణ భాగంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం అందడంతో అక్కడ తనిఖీలు చేపట్టారు.  ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలు, సాయుధ మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది, తెల్లవారుజాము నుంచే అడపాదడపా కాల్పుల  జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు, 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న గాలింపు చర్యల సమయంలో ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు.  ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం కుంట ఏరియా కార్యదర్శి మంగుడుతోపాటు హితేష్ అనే అగ్రనేతలు హతమైనట్టు తెలుస్తోంది. 

పోలీసు అధికారుల ప్రకారం, వామపక్ష తీవ్రవాదానికి కంచుకోటగా పరిగణించే దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టు కేడర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. భద్రతా బలగాలు రాత్రికి ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. తెల్లవారుజామున 5.00 గంటల ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీనికి ప్రతిగానే భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు.  

తెల్లవారుజామున గాలింపు సమయంలో ఎదురుకాల్పులు

డీఆర్‌జీ బృందం దక్షిణ బీజాపూర్‌లోని అటవీ ప్రాంతంలోకి మరింత దూరం వెళుతున్నప్పుడు, మావోయిస్టు కేడర్ల నుంచి వారిపై కాల్పులు జరిగాయి, దీంతో అటవీ ప్రాంతం కాల్పు మోతతో మారుమోగింది. భద్రతా సిబ్బంది ప్రతిఘటించడంతో, చాలా గంటల పాటు కాల్పుల జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు దిగ్బంధించాయి. దట్టమైన అడవి చాటున ఏ మావోయిస్టులు తప్పించుకోకుండా ఉండేలా అదనపు బలగాలను మోహరించారు.

ఈ ఆపరేషన్ వివరాలను అందిస్తూ, బస్తర్ ఐజీ పి సుందర్‌రాజ్ మాట్లాడుతూ, “బీజాపూర్ జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు ఉన్నారనే నిఘా సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు ప్రారంభించాం. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఆపరేషన్‌లో ఉంది. తెల్లవారుజామున 5.00 గంటల నుంచి డీఆర్‌జీ , మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు  జరుగుతున్నాయి. ఇప్పటివరకు, గాలింపు చర్యల సమయంలో ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.”

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rahul Gandhi Protest:ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget