CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడానికి గల కారణాలపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ మాట్లాడారు.

Telangana CM Revanth Reddy | న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడం సంచలనంగా మారింది. ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించి అందుకు కారణాన్ని వెల్లడించారు. సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ వాటిని సమీక్షిస్తుందన్నారు. ఆ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చేందుకు పరిశీలించే సందర్భాల్లో ప్రతిపాదించిన ప్రోగ్రామ్ వారు నిర్వహించే పదవికి, పర్యటన ఉద్దేశ్యానికి తగినట్లుగా ఉండాలని రణధీర్ జైస్వాల్ అన్నారు.
వారు నిర్వహించే పదవికి, పర్యటన ఉద్దేశ్యానికి ప్రతిపాదిత ప్రోగ్రామ్ తగినట్లుగా ఉండాలన్నారు. ‘ఈ నిర్దిష్ట విషయంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) పర్యటనకు సంబంధించి నిబంధనలు పాటించలేదు. వారి పర్యటన ఉద్దేశం పదవికి తగినట్లుగా సరిపోలలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి క్లియరెన్స్ నిరాకరించింది’ అని జైస్వాల్ తెలిపారు.
రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన రద్దు..
రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపిన వివరాల ప్రకారం.. రేవంత్ రెడ్డి ప్రస్తుతం యూకేలోని లండన్‌లో ఉన్నారు. అక్కడ నుండి అమెరికాకు వెళ్లి, ఆ తర్వాత ఆగస్టు 30న హైదరాబాద్ తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్నారు.
#WATCH | Delhi: On Telangana CM Revanth Reddy's foreign visit, MEA Spokesperson Randhir Jaiswal says, "... Let me also tell you that clearance was given for his visit to the United Kingdom."
— ANI (@ANI) August 21, 2026
On permission denied for Telangana CM Revanth Reddy's visit to the United States, MEA… pic.twitter.com/ulC71RmGbF
విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంతో, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని అధికారిక "తెలంగాణ-రైజింగ్" ప్రతినిధి బృందం తమ యూఎస్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సిఎమ్‌ఓ పేర్కొంది. ప్రోటోకాల్‌కు అనుగుణంగా యూకే, అమెరికా రెండు పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతిని కోరింది. అయితే కేవలం యూకే పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది.
Also Read: Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
కేంద్ర నిర్ణయంపై రేవంత్ రెడ్డి ఆశ్చర్యం
అధికారిక ప్రతినిధి బృందం యూకే చేరుకున్న తర్వాత ఈ నిరాకరణ గురించి కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బోస్టన్ వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని సీఎంఓ పేర్కొంది.
తెలంగాణ రైజింగ్ విజన్‌ను ముందుకు తీసుకెళ్లడం, విద్యను ప్రోత్సహించడం, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకున్న యూఎస్ పర్యటనను రాజకీయ కారణాలతో నిలిపివేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్ర కొత్త విద్యా విధానం ప్రకారం ప్రపంచంలోని కొన్ని అగ్రగామి విద్యా సంస్థలను భారత్, తెలంగాణకు.. హైదరాబాద్‌కు తీసుకురావడమే ఈ ప్రతిపాదిత పర్యటన ఏకైక ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడడ్ి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంస్థలు ప్రముఖ ఐవీ లీగ్ (Ivy League), ఇతర గ్లోబల్ సంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణను కోరుకునే యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో దోహదం చేస్తాయి.
అమెరికాలో హార్వర్డ్, ఎంఐటీ, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలను సీఎం రేవంత్ టీమ్ సందర్శించాల్సి ఉంది. తర్వాత న్యూయార్క్ సిటీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ పర్యటనలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 16న కేంద్ర విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు






















