Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Rayadurgam Land Record Price | రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గంలో TGIIC నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఎకరా భూమి రికార్డు స్థాయిలో రూ.264 కోట్లు పలికింది.

Rayadurgam Land Auction | హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని TGIIC భూములు రికార్డు ధర పలికాయి. తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఎకరా భూమి రూ.264 కోట్ల భారీ ధర పలికింది. MSN రియాలిటీ సంస్థ అంత ధర పలికి భూములు దక్కించుకుంది. అధిక ధర పలికి మొత్తం 5.25 ఎకరాలను అదే సంస్థ వేలంలో సొంతం చేసుకుంది. దాదాపు 3 నెలల కిందట జరిగిన వేలంలో ఇదే సర్వే నెంబర్‌లో ఎకరా భూమి ఏకంగా రూ.237 కోట్లు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రికార్డు బద్ధలుకొట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. భూముల వేలానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేయడంతో సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాలను ఆన్‌లైన్లో వేలం వేశారు.
రాయదుర్గం భూముల వేలానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్
రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం పాన్‌మక్తాలో 11 ఎకరాల టీజీఐఐసీ (TGIIC) భూముల వేలం ప్రక్రియను నిలిపివేసుందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నిరాకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గతంలో స్టే ఇచ్చిన కంచ గచ్చిబౌలి భూములకు, వేలం వేసే ప్రాంతానికి 5 కి.మీ దూరం ఉందని, రెండింటికీ సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ స్పష్టం చేయడంతో జువ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం తిరస్కరించింది. ఇంకా ఈ విషయంపై ఏమైనా వివాదాలుంటే తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది.
ఇప్పటికే ఈ వేలంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జీలు కూడా ఇదివరకే నిరాకరించారు. ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ (ఎల్‌ఆర్‌టీ)ను ఆశ్రయించినట్లు లేదా విచారణ పెండింగ్‌లో ఉన్నట్లు ఆధారాలు లేవని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ పేర్కొనగా, ఎస్. రవీంద్రనాథ్ దాఖలు చేసిన మరొక పిటిషన్‌పై జస్టిస్ నగేష్ భీమపాక ప్రభుత్వం, హెచ్‌ఎండీఏలను కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 19కి వాయిదా వేయడం తెలిసిందే. దీంతో ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరతో టీజీఐఐసీ చేపట్టిన ఆన్‌లైన్ వేలానికి మార్గం సుగమమైంది. అయితే టీజీఐఐసీ (TGIIC) ఆన్‌లైన్లో భూమల వేలం నిర్వహించగా రికార్డు స్థాయిలో ఎకరా 264 కోట్లు పలికింది. దాదాపు మూడు నెలల కిందట నిర్వహించిన వేలంలో ఇక్కడి భూమి ఎకరా రూ. 237 కోట్లు పలికిన విషయం తెలిసిందే.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు






















