అన్వేషించండి

Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

Irumudi Review In Telugu: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన సినిమా 'ఇరుముడి'. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందంటే?

Ravi Teja Irumudi Movie Review Telugu: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకుడు. 'బేబీ' నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్ ప్రధాన తారాగణం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ట్రైలర్, పాటలు అంచనాలు పెంచాయి. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.

కథ (Irumudi Movie Story): తన కూతురు మణెమ్మ అలియాస్ మణికంఠ ('బేబీ' నక్షత్ర) అంటే త్రినాథ్ (రవితేజ)కు ప్రాణం. తన కూతుర్ని మాత్రమే కాదు... తమ ఊరిలోని ప్రతి ఆడపిల్లను సొంత కూతురిలా చూస్తాడు. అమ్మాయిలను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు. కొట్టి మరీ వస్తాడు. అయ్యప్ప మాల ధరించిన 41 రోజులు మినహా మిగతా అన్ని రోజులూ మద్యం మత్తులో ఉంటాడు త్రినాథ్. అతడికి అదొక వ్యసనం. 

త్రినాథ్ చేతిలో తన్నులు తిన్న వాళ్ళందరూ అతడు ఎప్పుడు మాల ధరిస్తాడు? ఎప్పుడు తమ పగ తీర్చుకోవచ్చు? అని ఎదురు చూస్తారు. అటువంటి వాళ్ళు అందరికీ వార్నింగ్ ఇచ్చి మరీ అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు త్రినాథ్. అప్పుడు ఏం జరిగింది? గురుస్వామి గోపరాజు (సాయి కుమార్) కుమార్తె కనిపించలేదని వెతుకుతూ వెళ్ళిన ఊరి జనాలకు ఏం తెలిసింది? మందు మానేయమని తండ్రిని మణెమ్మ ఎందుకు కోరింది? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Irumudi Review Telugu): ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ఏదైనా చెప్పుకోగలమనే ధైర్యంతో - ప్రీ క్లైమాక్స్‌లో రవితేజ డైలాగ్. 'ఇరుముడి'లో మెయిన్ పాయింట్, కోర్ ఎమోషన్ ఆ ఒక్క మాటలో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ. తాను విన్నది, చూసినది... ప్రతిదీ తండ్రితో చెప్పే అలవాటు ఉన్న అమ్మాయి మణెమ్మ. అటువంటి చిన్నారి ఒకానొక సందర్భంలో తండ్రికి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఓ ప్రమాదం. కూతురి దగ్గర తండ్రి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ప్రేక్షకులు ఫీలయ్యేలా తీశారు శివ నిర్వాణ.

'ఇరుముడి' కథలో చూపించిన తండ్రీ కుమార్తెల ఎమోషన్ గానీ, యాక్షన్ గానీ, ఆ విలన్ ట్రాక్స్ గానీ కొత్త కాదు. 'నా పేరు శివ' సహా కొన్ని సినిమాల ఛాయలు మధ్య మధ్యలో కనిపిస్తాయి. అయితే... దర్శకుడు శివ నిర్వాణ కనికట్టు చేశారు. తెరపై సన్నివేశాలు వచ్చేటప్పుడు చూసేలా మేజిక్ చేశారు. అందుకు మేజర్ క్రెడిట్ రవితేజ, నక్షత్రలకు ఇవ్వాలి. వాళ్ళిద్దరి బాండింగ్ చూడముచ్చటగా ఉంది. తెరపై ఇద్దరూ కనిపించినప్పుడు మరొక ఆలోచన మనసులోకి రాదు. అయితే సరదా లేదంటే యాక్షన్ సన్నివేశాలతో ముందుకు తీసుకు వెళ్ళారు శివ నిర్వాణ.

Also ReadVishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?

'ఇరుముడి'లో మేజర్ ట్విస్ట్ తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఎమోషన్ సినిమాను డౌన్ చేసింది. ఎవరూ ఊహించని ట్విస్ట్ షాక్ ఇచ్చింది. ఆ ట్విస్ట్ సర్‌ప్రైజ్. తర్వాత వచ్చే సీన్లు కాదు. అయితే... సినిమా అంతటా కొత్త రవితేజను - కమర్షియల్ పంథాకు దూరంగా కొత్త తెలుగు సినిమాను చూపించడంలో శివ నిర్వాణ సక్సెస్ అయ్యారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా తీశారు.
టెక్నికల్ పరంగా చూస్తే... 'ఇరుముడి'కి సినిమాటోగ్రఫీ, సంగీతం ప్లస్. పల్లెను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది విష్ణు శర్మ కెమెరా వర్క్ చూస్తే! జీవీ ప్రకాష్ కుమార్ కథకు తగ్గట్టు పాటలు ఇచ్చారు. 'మల్లెపూల పల్లకి...' సాంగ్, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ ఇస్తాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. సినిమా అంతా రియల్ లొకేషన్లలో తీసినట్టు ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది. సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా తీశారు.

'ఇరుముడి' కోసం రవితేజలోని కమర్షియల్ కథానాయకుడిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆడపిల్ల తండ్రి మాత్రమే తెరపై కనిపించేలా సహజంగా నటించారు మాస్ మహారాజా. సినిమా ప్రారంభం నుంచి లుంగీలో కనిపించారు. ట్రాలీ ఆటో నడుపుతూ పల్లెటూరి మనిషి లుక్ మైంటైన్ చేశారు.

'శంభో శివ శంభో' తరహా సినిమాల్లో రవితేజ చూపించిన ఎమోషన్స్, యాక్షన్ సెటిల్డ్‌గా ఉంటుంది. కానీ కమర్షియల్ సినిమాల్లో హీరోయిజం చూపించేటప్పుడు స్టార్ ఇమేజ్ ఉంటుంది. నటనలో వ్యత్యాసం కనిపిస్తుంది. 'ఇరుముడి'లో ఆయన నటన చూస్తే... 'శంభో శివ శంభో' గుర్తుకు వస్తుంది. అంతకు మించి డౌన్ ప్లే చేశారు. సరైన కథ, క్యారెక్టర్ వస్తే ఇమేజ్ పక్కన పెట్టడానికి రవితేజ రెడీ అని సినిమా చూశాక అర్థం అవుతోంది. క్లైమాక్స్, అందులో డైలాగులు ఆయనపై గౌరవం పెరుగుతుంది.

Also ReadDC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూలో ఏముంది? అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ సినిమా రాతను ఎలా మార్చింది?

రవితేజ తర్వాత సినిమాలో ఎక్కువ మందిని ఆకట్టుకునేది 'బేబీ' నక్షత్ర. ఆమెను చూస్తున్నంత సేపూ మన ఇళ్లల్లో తిరిగే గడుసు పిల్లలా అనిపిస్తుంది. రవితేజతో నక్షత్ర సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ కూడా సహజమైన నటనతో మెప్పించారు. సాయి కుమార్, శ్వాసిక, రమేష్ ఇందిరా, మీసాల లక్ష్మణ్, అజయ్ ఘోష్, సురభి ప్రభావతి రొటీన్ రోల్స్ చేశారు. అయితే, ఆయా పాత్రలు కథలో ఇమిడిపోయాయి.

'ఇరుముడి'... రెగ్యులర్ రవితేజ సినిమా కాదు. మాస్ కమర్షియల్ రొటీన్ అనిపించే సినిమాలకు భిన్నమైన సినిమా. అలాగని, రవితేజ ఫైట్స్ చేయలేదా? అంటే... చేశారు. అవన్నీ కథలో భాగంగా వచ్చాయి. కావాలని ఫైట్ చేసినట్టు అనిపించదు. కథ, కథలో కీలకమైన ట్విస్ట్ రొటీన్ అనిపించినా... ప్రారంభం నుంచి ముగింపు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న లోపాలను కవర్ చేసింది. కమర్షియాలిటీ కోసం శివ నిర్వాణ పక్కకు అడుగులు వేయలేదు. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కన పెట్టి ఆడపిల్ల తండ్రిగా జీవించారు. ఆయన్ను కొత్తగా చూడటం బావుంది. కుటుంబ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులకు అమితంగా నచ్చే చిత్రమిది.

Also Read: Vishal Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gunde Ninda Gudigantalu September 9th: గుండె నిండా గుడిగంటలు: మీనాని తక్కువ చేసిన రోహిణి.. ఇచ్చిపడేసిన శృతి! రోహిణికి గుణ బ్లాక్‌మెయిల్!
గుండె నిండా గుడిగంటలు: మీనాని తక్కువ చేసిన రోహిణి.. ఇచ్చిపడేసిన శృతి! రోహిణికి గుణ బ్లాక్‌మెయిల్!
Podarillu Serial Today September 9th: పొదరిల్లు సీరియల్: ఈ పెళ్లి చేసుకోవద్దు పెద్ది.. మహా మాటలకు మాధవ నిర్ణయం మార్చుకుంటాడా! రేపే నిశ్చితార్థం!!
పొదరిల్లు సీరియల్: ఈ పెళ్లి చేసుకోవద్దు పెద్ది.. మహా మాటలకు మాధవ నిర్ణయం మార్చుకుంటాడా! రేపే నిశ్చితార్థం!!
Nivetha Thomas Srimathi : మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా శ్రీమతి - రెండేళ్ల తర్వాత నివేదా కొత్త మూవీ... ఫస్ట్ లుక్ చూశారా?
మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా శ్రీమతి - రెండేళ్ల తర్వాత నివేదా కొత్త మూవీ... ఫస్ట్ లుక్ చూశారా?
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
Deepika Padukone Baby Bump: కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
Hartalika Teej 2026: గణేష్ చతుర్థి రోజు అరుదైన సంయోగం, ఈ 4 రాశుల మహిళలకు అదృష్టం!
గణేష్ చతుర్థి రోజు అరుదైన సంయోగం, ఈ 4 రాశుల మహిళలకు అదృష్టం!
Embed widget