Protecting Kids Online : పేరెంట్స్ అలెర్ట్.. మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే జాగ్రత్త, న్యూ రూల్స్‌తో షాక్ ఇవ్వబోతున్న గవర్నమెంట్
Children's Online Safety : పిల్లలు ఇకపై సోషల్ మీడియాను ఉపయోగించాలంటే గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్తరూల్స్ ఫాలో అవ్వాలట. ఇవి పిల్లలకోసమే.. కానీ పేరెంట్స్ ఫాలో అవ్వాలి.

Parental Consent and Online Child Safety : మా పిల్లాడికి ఫోన్లో అన్ని ఫీచర్స్ తెలుసు. నాకంటే అన్ని బాగా ఉపయోగించేస్తాడు అనే ఆనందాన్ని వ్యక్తం చేయడం నుంచి.. అబ్బబ్బా ఎంతసేపు చూస్తావు రా ఆ ఫోను. బయటకెళ్లి ఆడుకో అనే బాధ పేరెంట్స్‌లో ఉంది. రీసెంట్గా హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో రాత్రి పదిగంటలకు ఫోన్ వాడకురా అని ఓ తండ్రి మందలించినందుకు ఓ పిల్లాడు ఇంట్లోనుంచి వెళ్లిపోయిన ఘటన పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు.. పిల్లలు ఫోన్‌కి ఏవిధంగా అడెక్ట్ అయిపోయారో. ఇవేకాదు ఇలాంటివి ఎన్నో సంఘటనలు రోజూ వింటూనే ఉంటున్నాము.
ఈ నేపథ్యంలో గవర్నమెంట్ పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడంపై కొత్త రూల్స్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. DTDP (Digital Personal Data Protection Rules 2025)లో భాగంగా ప్రభుత్వం కొత్తరూల్స్ తయారు చేసింది. 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాలో (Facebook, Instagram, X)వంటి సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే కచ్చితంగా పేరెంట్స్ పర్మిషన్ ఉండాలనే సారాంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ డ్రాఫ్ట్ రూల్స్ ఫైనల్ అయితే.. తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్‌ని క్రియేట్ చేసుకోలేరు. అయితే గవర్నమెంట్ పేరెంట్స్ పర్మిషన్స్‌తో అకౌంట్స్ క్రియేట్ చేయడానికి ఎలాంటి రూల్స్ అప్డేట్ చేస్తుందో చూడాలి.
కారణాలు ఇవే..
9 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు రోజూ సోషల్ మీడియాలో మూడు నుంచి ఆరుగంటలు సమయం వెచ్చిస్తున్నట్లు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీని కారణంగా పిల్లలు ఫిజికల్‌గా, స్టడీల్లో కూడా యాక్టివ్‌గా ఉండట్లేదని గుర్తించారు. మొబైల్ గేమ్స్ ఆడడానికి చూపిస్తున్న శ్రద్ధ.. అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు చూపించట్లేదట. ఈ కారణంగానే గవర్నమెంట్ కొత్తరూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియా, ఓటీటీల ఎఫెక్ట్ పిల్లల్లో మానసికంగా ప్రతికూలమైన ప్రభావాలు చూపిస్తున్నట్లు గుర్తించారు.
చిన్నతనాన్ని కోల్పోతున్న చిన్నారులు
సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్లిరాజు కామెడీని అందరూ ఎంజాయ్ చేశారు కానీ.. పిల్లలపై ఓటీటీ, సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చెప్పేందుకు ఆ క్యారెక్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్నతనంలోనే.. తమలోని చైల్డ్ని పిల్లలు కోల్పోతున్నారు. పిల్లలు పిల్లల్లా బిహేవ్ చేయకుండా.. చిన్నతనంలోనే పెద్దవారిగా మారిపోతున్నారనేది అందరినీ షాకింగ్‌కు గురిచేస్తుంది. అందుకే పిల్లల విషయంలో సపరేట్ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ని తీసుకొస్తూ.. పేరెంట్స్ పర్మిషన్‌తోనే ఉపయోగించేలా చాలావరకు అప్డేట్ తీసుకువస్తుంది.
పిల్లల్లో పెరుగుతున్న అడల్ట్రీ
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. రీల్స్, వ్యూస్ కోసం పిల్లలతో రీల్స్ చేయించే పేరెంట్స్ కూడా ఉన్నారు. కొందరు పిల్లలు అయితే అడల్ట్ జోక్స్ వేయడం నుంచి.. హావభావాల్లో కూడా అడల్ట్స్ని మించిన కంటెంట్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలా చేసేవారి సంఖ్య మరింత పెరిగిపోతుంది. పిల్లలు కూడా కపుల్స్‌గా చేస్తూ ఫన్ పేరుతో రోత పుట్టిస్తున్నారు. లైక్స్ కోసం పిల్లలు ఎక్స్ట్రీమ్ లెవెల్‌కి దిగజారిపోతున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత పేరెంట్స్ మీద ఉండబోతుంది.
బూతులు మాట్లాడడం నుంచి.. ఎక్స్పోజింగ్, రొమాన్స్ వంటి పోస్ట్‌లు, వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. పైగా వీటికింద కామెంట్ల రూపంలో వచ్చే నెగిటివిటీ అంతా ఇంతాకాదు. ఈ తరహా నెగిటివిటీ కూడా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తుంది. అందుకే గవర్నమెంట్ ఈ తరహా డ్రాఫ్ట్ రూల్స్ రెడీ చేసింది. ఈ రూల్స్ అందరూ ఆహ్వానించేటట్లే ఉన్నాయి.
Also Read : పిల్లలు మంచిగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలివే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

