పిల్లల ఎముకలు స్ట్రాంగ్ ఉండాలంటే ఈ ఫుడ్స్ బెస్ట్
పాలు బోన్స్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. దీనిలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎముకలను స్ట్రాంగ్‌గా చేస్తుంది.
యోగర్ట్ లేదా పెరుగు ఎముకల ఆరోగ్యానికి మంచిది. దీనిలో కూడా కాల్షియం, విటమిన్ డి ఉంటుంది. అంతేకాకుండా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి హెల్తీ బోన్స్ని ప్రమోట్ చేస్తాయి.
చీజ్‌లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. న్యూట్రిషన్స్‌తో నిండిన ఈ ఫుడ్స్ హెల్తీ బోన్స్ని ప్రమోట్ చేస్తుంది.
గుడ్లలోని విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్ కూడా దీనిలో పుష్కలంగా ఉంటుంది. ఇది వారి ఎదుగుదలకు చాలా మంచిది.
పాలకూరలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె ఉంటాయి. ఈ న్యూట్రీషియన్స్ స్ట్రాంగ్ బోన్స్ని అందించి పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి.
బ్రోకలి పూర్తి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. దీనిలో కాల్షియం, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పిల్లల పెరుగుదలకు మంచివి.
చేపల్లో విటమిన్ డి, ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు మంచివి. కాల్షియంను అబ్జార్బ్ చేసుకుని పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.
సోయా బీన్స్ లేదా సోయా మిల్క్‌ని కూడా పిల్లల డైట్లో చేర్చవచ్చు. ఇవి కూడా బోన్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి. ఎందుకంటే కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం వీటిలో పుష్కలంగా ఉంటాయి.
పిల్లల వయసును బట్టి ఈ ఫుడ్స్‌ని వారి డైట్లో చేర్చుకోవాలి. కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.