ఆ సమస్యలు దూరం

గోజి బెర్రీ పండ్లతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో

Published by: Geddam Vijaya Madhuri

న్యూట్రిషన్లు ఇవే

గోజి బెర్రీలు కాస్త పుల్లగా ఉంటాయి. కానీ వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

కంటి చూపునకై.. గోజి బెర్రీ పండ్లు బ్లూ లైట్​ నుంచి కళ్లను రక్షిస్తాయి. ఇవే కాకుండా వయసు పరంగా వచ్చే కంటి సమస్యలను ఇవి దూరం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.

కొలెస్ట్రాల్​

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యానికై..

గోజి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. గుండె సమస్యలను తగ్గిస్తాయి.

రోగ నిరోధక శక్తికై..

ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తాయి.

ఆర్థరైటిస్

గోజి బెర్రీలలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ సమస్యలను దూరం చేస్తాయి. కీళ్ల సమస్యలను తగ్గిస్తాయి.

అలెర్జీలు ఉంటే..

గోజి బెర్రీలు తీసుకుంటే కొందరిలో అలెర్జీలు, జీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

అవగాహన కోసమే..

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతనే డైట్​లో చేర్చుకోవాలి.