రోజు టీస్పూన్ కాళోంజీ సీడ్స్ తీసుకుంటే.. మధుమేహం, బీపీ మాయం
కాళోంజీ సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి.
కాళోంజీ సీడ్స్ రెగ్యూలర్‌గా తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. రోజూ స్పూన్ సీడ్స్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు.
కాళోంజి సీడ్స్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయని చెప్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి.. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదయాన్నే కాళోంజీ సీడ్స్‌ని తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
మీ రెగ్యూలర్ డైట్లో కాళోంజీ సీడ్స్ తీసుకుంటే.. బరువు తగ్గడం ఈజీ అవుతుందట. గోరువెచ్చని నీటిలో.. తేనెను కలిపి.. నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.
రోజూ కాళోంజీ సీడ్స్‌ని డైట్లో చేర్చుకుంటే బీపీ కంట్రోల్ అవుతుందట. రోజూ ఒక స్పూన్ కాళోంజీ సీడ్స్ తీసుకుంటే సరిపోతుంది.
పళ్లు వీక్‌గా ఉన్నా.. గమ్స్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. పంటి నొప్పి ఉన్నా.. దూరం చేసే వాటిలో కాళోంజీ సీడ్స్‌లో ఉన్నాయి.
కాళోంజీ నూనెను జుట్టుకు అప్లై చేస్తే జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి. వారానికోసారి దీనిని మీరు అప్లై చేయవచ్చు.
వయసు పెరిగే కొద్ది కీళ్లనొప్పులు కామన్‌గా వస్తూ ఉంటాయి. మీరు కాళోంజీ నూనె.. ఆవనూనెతో కలిపి మసాజ్ చేసుకుంటే నొప్పులు దూరమవుతాయి.
పింపుల్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీరు రెగ్యూలర్‌గా కాళోంజీ సీడ్స్ తీసుకుంటే.. పింపుల్స్ సమస్య దూరమవుతుంది.
ఇవన్నీ అవగాహన కోసమే. వీటిని డైట్లో చేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి.