ఇలా పెంచితే గులాబీ మొక్కలు బాగా పెరుగుతాయట చాలామందికి గులాబీ మొక్కలను బాగా ఇష్టపడతారు కానీ.. వాటిని ఎలా పెంచాలో తెలీదు. తెలియక చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మొక్కలు వాడిపోతూ ఉంటాయి. సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. గులాబీ మొక్కలను బాగా పెంచుకోవచ్చట. గులాబీ మొక్కలకు కచ్చితంగా ఎండ తగలాలి. కనీసం నాలుగు గంటలైనా ఎండలో ఉంచాలి. రెగ్యూలర్గా నీటిని అందించాలి. కనీసం వారానికి రెండుసార్లు నీళ్లు వేయాల్సి ఉంటుంది. చలికాలం ముగిసిన తర్వాత, లేదంటే వసంతకాలానికి ముందు కాడాలను కట్ చేస్తే మంచిది. ఫెర్టిలైజ్ చేయాలి. మంచి మట్టిని, ఎరువును అందిస్తూ ఉండాలి. మొక్కలకు కూరగాయల కంపోస్ట్ వేస్తే పెరుగుదల బాగుంటుంది. మొక్కలో ఏదైనా భాగం కుళ్లిపోతే.. దానిని వెంటనే కట్ చేయాలి.