వీటిని ఫాలో అయితే మంచి నిద్ర మీ సొంతం నిద్ర రావట్లేదా? చాలా సింపుల్ టిప్స్ ఫాలో అయితే మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. రోజు త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ఒక్కరోజు కాదు.. రోజూ అదే టైమ్‌కి పడుకోవాలి. ఇలా రెగ్యూలర్‌గా చేయడం వల్ల మీకు అదే టైమ్‌కి నిద్ర వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. నిద్రపోయే ముందు ఎక్కువ ఫుడ్స్ తీసుకోకండి. లైట్ ఫుడ్ తీసుకోవాలి. అది కూడా రెండు గంటల ముందు. ఆల్కహాల్ తాగడం మానేయాలి. ఇది తాత్కాలిక నిద్రనిచ్చి.. మొత్తం నిద్రనే కరాబు చేస్తుంది. కనీసం అరగంట ముందు సెల్‌ఫోన్స్, టీవీలు చూడడం మానేయాలి. ఇది త్వరగా నిద్ర వచ్చేలా చేస్తుంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కాఫీ తాగడం మానేయండి. ఇది నిద్రకు అస్సలు మంచిది కాదు. పడుకునే బెడ్ రూమ్ ప్రశాంతంగా, నీట్‌గా ఉండాలి. అప్పుడే నిద్ర త్వరగా వస్తుంది. రోజూ వ్యాయామం చేస్తూ ఉంటే.. నిద్ర మెరుగుపడుతుందని అధ్యయనాలు తెలిపాయి. హెల్తీ డైట్ కూడా మంచి నిద్రను ప్రమోట్ చేస్తుంది. కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మరీ మంచిది.