మధుమేహమున్నవారు టీలో యాలకులు వేసుకుని తాగితే డయాబెటిస్ ఉన్నాసరే కొందరు టీ తాగడాన్ని కంటిన్యూ చేస్తారు. దానిలో షుగర్ మాత్రం తగ్గించుకుంటారు. అయితే మీరు టీ తాగేప్పుడు దానిలో యాలకులు వేసుకుని తాగితే చాలమంచిదంటున్నా నిపుణులు. టీలో యాలకులు వేసుకుని తాగడం వల్ల మంచి రుచి, అరోమాతో పాటు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయట. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని బయటపెట్టాయి. అందుకే టీలో యాలకులు వేసుకుని తాగమంటున్నారు. అలాగే యాలకులు బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తాయంటున్నారు. డిప్రెషన్, అధిక రక్తపోటు వంటి లక్షణాలను అదుపులో ఉంచుతాయట. కాబట్టి మీరు టీ తాగేప్పుడు రెండు యాలకులను దంచి వేసుకోవడం మరచిపోవద్దు. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుని ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)