కార్న్ రెగ్యూలర్‌గా తింటే ఇంత మంచిదా? మొక్కజొన్నలను హెల్తీ స్నాక్‌గా చెప్పవచ్చు. వీటిని కాల్చి లేదా ఉడకబెట్టి తింటారు. ఇవి కేవలం ఆకలిని తీర్చడమే కాదు. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. వీటిలోని న్యూట్రిషన్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. హెల్తీ హార్ట్ కోసం దీనిని డైట్లో చేర్చుకోవచ్చు. దీనిలో ఫైబర్ కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను దూరం చేసి.. గట్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. షుగర్ ఉన్నవారికి కూడా ఇది మంచి స్నాక్ ఆప్షన్. రక్తంలో చక్కెర స్థాయిలను ఇది కంట్రోల్ చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది రెటీనాను మెరుగుపరిచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రోనిక్ డీసీజ్ వంటి సమస్యలను తగ్గించి.. పూర్తి ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాల క్షీణతను తగ్గిస్తాయి. ఇతర ఆరోగ్య సమస్యలనుంచి కాపాడుతాయి. కంటితో పాటు.. పంటి ఆరోగ్యానికి కూడా కార్న్ చాలా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)