ఫుడ్ లిస్ట్

హై బీపీ ఉన్నవారు తీసుకోవాల్సిన ఫుడ్ ఇవే.. తినకూడనివి ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పొటాషియం..

పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అరటిపండ్లు, ఆకు కూరల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

వీటిలో కూడా..

చిలగడ దుంపలు, అవకాడో, బీన్స్, ఆల్మండ్స్, పిస్తాలు, వాల్​నట్స్, ఫ్యాటీ ఫిష్​లలో కూడా పొటాషియం ఉంటుంది కాబట్టి వీటిని డైట్​లో చేర్చుకోవచ్చు.

ఫ్రెష్ ఫుడ్స్..

ఫ్రెష్ కూరగాయలను కచ్చితంగా డైట్​లో తీసుకోవాలి. బెల్​ పెప్పర్స్, క్యారెట్స్, టమోటాలను సలాడ్స్​ రూపంలో కూడా తీసుకోవచ్చు. యాపిల్స్, బెర్రీలు, సిట్రస్ ఫ్రూట్స్ కూడా మంచివి.

ఇవి కూడా

బ్రౌన్ రెస్, క్వినోవా, గోధుమలు, పాలు, యోగర్ట్, చీజ్, చికెన్, ఫిష్ వంటి వాటిని మధ్యాహ్నం భోజనంలో తీసుకోవచ్చు. ఇవి బరువు తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి.

కాల్షియం రిచ్ ఫుడ్స్

పాల ఉత్పత్తులు, మొక్కల ఆధారిత పాలు, ఆకుకూరలు, టోఫు, సోయా వంటివి కాల్షియం పెంచుతాయి. బీపీ ఉండేవారిలో కాల్షియం తక్కువైపోయి సమస్యలు వస్తాయి. అందుకే కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి.

ఒమేగా 3

ఓమేగా 3 పుష్కలంగా ఉండే ఫుడ్స్ కూడా బీపీని కంట్రోల్ చేస్తాయి. ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, అవిసెగింజలు, వాల్​నట్స్ వంటిలో ఓమేగా 3 పుష్కలంగా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్

బెర్రీలు, ఆకుకూరలు, యాపిల్స్, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, గ్రీన్​ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపిని తగ్గిస్తాయి.

తినకూడనివి..

ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, సోడాలు, కూల్ డ్రింక్స్, వైట్ బ్రెడ్, స్వీట్స్, బట్టర్, ప్రొసెస్ చేసిన స్నాక్స్, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నీరు తాగుతూ ఉండాలి. ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది. సాల్ట్​ని వీలైనంత తగ్గించుకోవాలి. ఒత్తిడి దూరం చేసుకోవాలి. రెగ్యూలర్​గా మెడిసన్స్ తీసుకోవాలి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.