వాటితో జాగ్రత్త

జుట్టు రాలడానికి ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఓ కారణమేనట

Published by: Geddam Vijaya Madhuri

రోగనిరోధక శక్తి..

ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు కచ్చితంగా హెయిర్ ఫాలో అవుతుందట. రోగనిరోధక శక్తి తగ్గితే హెయిర్ ఫాలికల్స్ వీక్ అయిపోతాయి. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందట.

హార్మోనల్ సమస్యలు

హార్మోనల్ కచ్చితంగా జుట్టుపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే శరీరంలో హార్మోనల్ మార్పులు జరిగితే.. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ మార్పులు జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తాయి.

థైరాయిడ్

హైపర్ థైరాయిడిజం అయినా.. హైపో థైరాయిడిజమైనా.. జుట్టు ఎక్కువగా రాలుతుందని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి రెగ్యూలర్​గా మెడిసిన్ తీసుకుంటే ఇది కంట్రోల్ అవుతుందట.

ఒత్తిడి..

ఒత్తిడి శారీరకంగా, మానసికంగా కృంగదీస్తుంది. దీనివల్ల జుట్టు ఎక్కువగా కూడా రాలుతుందట. యోగా, మెడిటేషన్​తో ఒత్తిడి తగ్గించుకుంటే మంచిదట. దీనివల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుందట.

ఆర్థ్రరైటిస్..

ఆటోఇమ్యూన్ ఇబ్బందులు ఉంటే కూడా జుట్టు ఎక్కువగా రాలుతోందట. అయితే ఆర్థ్రరైటిస్, రూమాటాయిడ్ వంటి సమస్యల వల్ల హెయిర్ ఫాలికల్స్ వీక్ అవుతాయట. జుట్టు ఎక్కువగా రాలిపోతుందట.

స్కాల్ప్ ఇన్​ఫెక్షన్లు..

చుండ్రు వంటి స్కాల్ప్ ఇన్​ఫెక్షన్లు ఉంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుందట. జుట్టు మొదలు నుంచి వీక్ అయి.. ఎక్కువగా రాలిపోతూ.. మధ్యలో చిట్లిపోతుందట.

సైడ్ ఎఫెక్ట్స్

యాంటీ డిప్రెసెంట్స్, క్యాన్సర్ సంబంధిత డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే.. జుట్టు ఎక్కువగా రాలిపోతుందని చెప్తున్నారు. తర్వాత జుట్టు పెరుగుదల కూడా ఆలస్యమవుతుందట.

న్యూట్రిషియన్ డెఫియన్సీ

సరైన మోతాదులో న్యూట్రిషియన్స్ తీసుకోకుంటే.. జుట్టు ఎక్కువగా బాగా రాలిపోతుందట. విటమిన్ డి, జింక్, ఐరన్ కచ్చితంగా డైట్​లో తీసుకోవాలంటున్నారు.

క్యాన్సర్ ట్రీట్​మెంట్స్

క్యాన్సర్​కు చికిత్స తీసుకునేటప్పుడు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ముఖ్యంగా కిమో థెరపీ సమయంలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది.

జాగ్రత్తలు..

ఏ ఆరోగ్య సమస్యతో జుట్టు ఎక్కువగా రాలుతుందో తెలుసుకుని.. దానికి సంబంధించిన మెడిసిన్స్, సలహాలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.