సింపుల్ టిప్స్

మెహందీ అందంగా పండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి

Published by: Geddam Vijaya Madhuri

ఎక్స్ ఫోలియేట్..

చేతులు, కాళ్లకు మెహందీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా దానిని ఎక్స్​ఫోలియేట్ చేయాలి. దీనివల్ల చేతులు, కాళ్లపై ఉన్న మృతకణాలు తగ్గుతాయి.

లేయర్..

చేతులు కడుక్కుని.. పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు చేతులకు లేదా కాళ్లకు కొబ్బరి నూనె లేదా.. నిమ్మరసం అప్లై చేయాలి.

మెహందీ..

ఫ్రెష్, హై క్వాలిటీ మెహందీతో డిజైన్లు వేసుకుంటే మంచిగా పండుతుంది. అంతేకాకుండా ఎలాంటి డ్యామేజ్ ఉండదు.

ఓవర్ నైట్..

మెహందీని రెండు మూడు గంటలు లేదా.. రాత్రంతా ఉంచుకుంటే మంచి రంగు వస్తుంది.

ముందురోజు..

పండుగ లేదా ఏదైనా స్పెషల్​ డే ఉంటే.. దానికి ఓ రోజు ముందు మెహందీ పెట్టుకుంటే మంచిది. దీనివల్ల దాని రంగులు చాలా అందంగా కనిపిస్తుంది.

టిప్స్..

మెహందీ తీసిన వెంటనే.. చేతులను ఎక్కువగా కడగపోవడమే మంచిది. కొబ్బరి నూనె లేదా నిమ్మరసం అప్లై చేస్తే మరీ మంచిది.

అవి వద్దు..

కెమికల్స్ ఎక్కువగా ఉండే సబ్బు, బాడీ వాష్​లు ఉపయోగించకపోవడమే మంచిది. దీనివల్ల మెహందీ రంగు మారకుండా ఉంటుంది.

డార్క్ కలర్ కోసం..

మెహందీలో నిమ్మరసం కలిపి అప్లై చేస్తే మెహందీ మంచి రంగుతో పండుతుంది. లేదంటే హెన్నాలో ఇండిగో పౌడర్​ని మిక్స్ చేయవచ్చు.

నచ్చిన డిజైన్లు..

పండుగను ఎలివేట్ చేసేలా మీరు సింపుల్ లేదా హెవీ డిజైన్స్ మీరు మెహందీగా పెట్టుకోవచ్చు. ఇవి మంచి లుక్​ని ఇస్తాయి.