రైస్ వాటర్‌ని వారం రోజులు ముఖానికి అప్లై చేస్తే ఏమవుతుందో తెలుసా?
రైస్ వాటర్‌తో జుట్టుకి, స్కిన్‌కి మంచి ప్రయోజనాలుంటాయి. మరి ఈ నీటిని ఎలా తయారు చేయాలి? ఎన్ని రోజులు ఆ నీరు నిల్వ ఉంటుంది వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
వందగ్రాముల రైస్ తీసుకోవాలి. దానిని రెండు సార్లు కడిగి.. నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. దీనిని రెండురోజులు అలానే ఉంచేయాలి.
రెండు రోజులు రూమ్ టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి.. ఆ నీటిని 5 నుంచి 7 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దీనిని ఒక్కసారి తయారు చేసుకుని వినియోగించుకుంటే సరిపోద్ది.
రైస్ వాటర్‌లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిలో మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్లాస్ స్కిన్‌ని ప్రమోట్ చేస్తాయి.
రైస్ వాటర్ స్కిన్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. స్కిన్ టోన్‌ని మెరుగుపరిచి.. మంచి గ్లోని అందిస్తుంది.
బియ్యం ద్వారా వచ్చే వైట్ వాటర్ ఎక్స్‌ఫోలియేటర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మంపై మృతు కణాలను దూరం చేస్తుంది. దీనివల్ల స్కిన్ టోన్ మెరుగవుతుంది.
రాత్రుళ్లు పడుకునేముందు ఈ నీటిని ముఖంపై స్ప్రే చేసి అలాగే పడుకునిపోవాలి. ఉదయాన్నే ఇది మీకు మంచి లుక్‌ని ఇస్తుంది.
పింపుల్స్ తగ్గి స్కిన్ టోన్ మెరుగవుతుంది. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ముఖానికి మంచి హైడ్రేషన్‌ని ఇస్తుంది.
రైస్ వాటర్ మిగిలిపోయిందని పరిమితి దాటిన తర్వాత దానిని ఉపయోగిస్తే అది బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది స్కిన్‌కి మంచిది కాదు.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే.. మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.