యాంగ్జైటీని పెంచే కామన్ అలవాట్లు ఇవే

యాంగ్జైటీని అనేది మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.

అయితే తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల యాంగ్జైటీ ఎక్కువ అవుతుందంటున్నారు.

సరైన నిద్ర లేకపోతే యాంగ్జైటీతో పాటు డిప్రెషన్ కూడా పెరిగిపోతుందట.

కనీసం రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని చెప్తున్నారు.

కొందరు యాంగ్జైటీ ఉన్నప్పుడు సరిగ్గా ఫుడ్ తీసుకోరు. ఇది యాంగ్జైటీ లక్షణాలను పెంచుతుందట.

స్వీట్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కూడా యాంగ్జైటీని పెంచుతాయట. బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి.

ఒంటరిగా ఎక్కువకాలం ఉంటే యాంగ్జైటీ బాగా ఎక్కువ అవుతుందంటున్నారు.

మీకు సంతోషాన్నిచ్చే పర్సన్స్​తో కాల్ మాట్లాడడం, మీట్ అవ్వడం చేస్తే మంచిది.

ఫిజికల్​గా కూడా యాక్టివ్​గా లేకపోతే యాంగ్జైటీ ఎక్కువైపోతుందంటున్నారు నిపుణులు.

వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదలై ఒత్తిడిని దూరం చేస్తాయట.

తమను తామే చులకనగా చూసుకోవడం, తమకి ఏది చేతకాదంటూ సెల్ఫ్​గా క్రిటిసైజ్ చేసుకుంటారు.

ఈ తరహా పనులు కూడా యాంగ్జైటీ లక్షణాలను పెంచి కాన్ఫిడెన్స్​ను దూరం చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)