ఫిల్టర్ కాఫీని ఇంట్లో పర్ఫెక్ట్గా చేసేయండిలా
ఫిల్టర్ కాఫీ పౌడర్, నీళ్లు, పాలు, పంచదారను సిద్ధం చేసుకోవాలి.
దీనిని తయారు చేసుకోవడానికి రెండు కంపార్ట్మెంట్లతో కూడిన కాఫీ ఫిల్టర్‌ని ఉపయోగించుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ల మెత్తగా గ్రైండ్ చేసుకున్న కాఫీ పొడిని ఫిల్టర్‌లోని టాప్ కంపార్ట్మెంట్లో వేయాలి.
ఫిల్టర్ డిస్క్‌తో ఈ కాఫీ పొడిని నొక్కాలి. ఇలా చేయడం వల్ల కాఫీ పొడిలో ఎయిర్ లంప్స్ ఉండవు.
నీటిని మరిగించి.. నెమ్మదిగా కాఫీ కంపార్ట్మెంట్లో వేయాలి. కింది కంపార్ట్మెంట్లోకి కాఫీ నీళ్లు వస్తాయి.
కాఫీ పౌడర్నుంచి కాఫీ డికాక్షన్ రావడానికి పావుగంట సమయం పడుతుంది.
ఇప్పుడు పాన్‌లో పాలు వేసి మరిగించి పక్కన పెట్టుకోవాలి. కాఫీ పూర్తిగా సెకండ్ కంపార్ట్మెంట్లోకి వస్తుంది.
వచ్చిన కాఫీని, పాలను ఒకే మోతాదులో తీసుకుని.. రెండిటీని కలుపుకోవాలి.
రుచికి తగ్గట్లుగా పంచదారను వేసి.. కలుపుకుని తాగేయడమే. అంటే ఫిల్టర్ కాఫీ రెడీ.