సేఫ్టీ టిప్స్

దీపావళి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Published by: Geddam Vijaya Madhuri

దీపావళి క్రాకర్స్

దీపావళి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి ఎన్ని సమస్యలు వస్తాయో చెప్పనవసరం లేదు.

పటాసులు కాల్చేప్పుడు..

దీపాల పండుగే అయినా.. పటాసులు కాల్చకపోతే దీపావళి ఫీలే రాదు కొందరికి. అందుకే ఫైర్ వర్క్స్, క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇంట్లో దాచేప్పుడు..

పండుగ కోసం ఇంటికి టపాసులు తెచ్చుకుంటే వాటిని మండేవాటికి దూరంగా ఉంచాలి. లేదంటే అగ్నిప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆ ప్రాంతాల్లో వద్దు..

క్రాకర్స్ ఎప్పుడూ ఇండోర్​లలో కాల్చకూడదు. బయటి ప్రాంతాల్లో.. డాబాల మీద వీటిని కాల్చుకోవచ్చు. అంతేకాకుండా నీటిని దగ్గర్లో ఉంచుకోవాలి. ప్రమాదం జరగకుండా హెల్ప్ చేస్తాయి.

దుస్తుల విషయంలో..

క్రాకర్స్ కాల్చేప్పుడూ కాటన్ దుస్తులు, నైలాన్ దుస్తులు వేసుకుంటే మంచిది. వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది.

సేఫ్టీ మెజర్స్..

పిల్లలు, పెట్స్ ఉంటే కచ్చితంగా పేరెంట్స్ అలెర్ట్​గా ఉండాలి. ఎమర్జెన్సీ నెంబర్​లను అందుబాటులో ఉంచుకోవాలి.

పిల్లల విషయంలో..

పిల్లలు క్రాకర్స్ కాల్చేప్పుడు తల్లిదండ్రులు వారి దగ్గరే ఉండాలి. పిల్లలకు మంటను దూరంగా ఉంచాలి. పిల్లల దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

పెట్స్ విషయంలో..

క్రాకర్స్ కాల్చేప్పుడు పెట్స్​ని ఇంట్లోనే ఉంచాలి. వాటికి సౌండ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవి భయపడిపతాయి.

వారు దూరంగా ఉంటే మంచిది..

వాయు కాలుష్యం వల్ల ఇబ్బందులు రాకుండా మాస్క్​లు వేసుకోవాలి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉంటే క్రాకర్స్​కి దూరంగా ఉండాలి. నీటిని ఎక్కువగా తాగాలి. స్వీట్స్​ తగ్గించి తీసుకోవాలి.

అవగాహన కోసం

ఈ సేఫ్టీ టిప్స్ అవగాహన కోసమే. నిపుణులు సూచనలు ఫాలో అయితే ప్రమాదాలు నివారించవచ్చు. (Images Source : Envato)