చన్నీళ్లతో స్నానం చేస్తే జీవితమే మారిపోద్దట ఏ కాలమైనా వేడినీళ్లతో స్నానం చేస్తారు కొందరు. చలికాలంలో వీరి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అయితే చన్నీళ్లతో రోజూ స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒత్తిడిని తగ్గించి.. లోపలి నుంచి మైండ్‌ని రిలాక్స్ చేస్తుందట. యాంగ్జైటీ కూడా కంట్రోల్లో ఉంటుందట. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, చర్మ సమస్యలు కూడా రావట. విల్ పవర్‌ని పెంచుతుంది. చిన్న విషయాలకు ఆందోళన కాకుండా.. మానసికంగా మీరు స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది. చన్నీళ్లు చర్మంపై డర్ట్ని వదిలించి ముడతలు దూరం చేస్తుంది. కండరాలకు బలాన్ని అందిస్తుంది. శరీరంలో రక్తప్రసరణను పెంచి.. నొప్పులను దూరం చేస్తుంది. శరీరంలోని బ్రౌన్ ఫ్యాట్‌ని యాక్టివేట్ చేసి శరీరంలో హీట్‌ని ఇస్తుంది. దీనివల్ల కేలరీలు కరిగి బరువు తగ్గుతారు. చన్నీళ్లతో స్నానం చేసేప్పుడు కొందరికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అప్పుడు డీప్ బ్రీత్ తీసుకుంటే సరి. హెల్తీ హెయిర్‌ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. చన్నీళ్లు స్కాల్ప్ ఆరోగ్యానికి మంచివి. అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)