మటన్‌తో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే
మటన్‌లో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో దొరుకుతుంది. ఇది కండరాల పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది.
మటన్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలను ప్రమోట్ చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.
మటన్‌లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12, బి6తో పాటు నియాసిన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి.
పంది, బీఫ్లతో పోలీస్తే మటన్‌లో శాచ్యూరేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. దీనిలో ఫాస్పరస్, జింక్, సెలినీయం వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
మటన్‌లోని ప్రోటీన్, విటమిన్స్ ఎనర్జీని అందిస్తాయి. ఫటిగో వంటి సమస్యలను దూరం చేస్తాయి.
ఎముకలు దృఢంగా మారేందుకు మటన్ తినమని డాక్టర్లు కూడా సిఫార్సు చేస్తారు. దీనిలోని ఫాస్పరస్, కాల్షియం బోన్ డెన్సిటీని తగ్గిస్తాయి.
మటన్‌ను వివిధ రకాలుగా డైట్లో చేర్చుకోవచ్చు. కూర చేసుకోవచ్చు. సూప్స్ తాగొచ్చు. కెబాబ్స్, ఫ్రై ఇలా డిఫరెంట్ స్టైల్లో కుక్ చేసుకోవచ్చు.
మటన్‌ని బాగా ఉడికించుకుని తింటే మంచిది. పచ్చిగా ఉండే మీట్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)