దీపావళి సమయంలో క్రాకర్స్ వల్ల వాయుకాలుష్యం ఎక్కువైతుంది. మతాబులు, ఇతర క్రాకర్స్‌కి సంబంధించిన బూడిద జుట్టుపై పడి డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఈ సమయంలో జుట్టుని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయటనుంచి వచ్చిన తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి. మైల్డ్ షాంపూతో జుట్టును ముఖ్యంగా స్కాల్ప్‌ను శుభ్రం చేసుకోవాలి. తడి జుట్టుతో బయటకు వెళ్లకపోవడమే మంచిది. అలా వెళ్లాల్సి వస్తే కవర్ చేసి వెళ్లండి. పొలుష్యన్ ఎక్కువగా ఉన్న సమయంలో లేదా మందులు కాల్చే సమయంలో హెయిర్‌ని కవర్ చేసుకోవాలి. హెయిర్ ప్రెటెక్ట్ సీరస్ అప్లై చేసుకుంటే జుట్టుకు కండీషన్ అందుతుంది. డ్యామేజ్ ఉండదు. పండుగ సమయంలో కొందరు నీరు అస్సలు తాగరు. అలా కాకుండా హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి.