అరటిపండు రోజూ ఒకటి తింటే ఇన్ని లాభాలా?
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లెడ్ ప్రెజర్ని కంట్రోల్ చేయడంతో పాటు.. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం దూరమవుతుంది. గట్ ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది.
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఒత్తిడిని దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.
పోటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన అరటిపండ్లు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తాయి.
చాలామంది అరటిపండు తింటే బరువు పెరుగుతామనుకుంటారు కానీ.. సరైన విధానంలో తీసుకుంటే.. బరువును తగ్గించుకోవడం కోసం దీనిని తీసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో కాకుండా రోజుకు ఒకటి తింటే బరువు కంట్రోల్ అవుతుంది.
బ్లడ్ షుగర్ కాస్త పెరిగే అవకాశముంది కాబట్టి.. అరటిపండును మధుమేహమున్నవారు తినకపోవడమే మంచిది.
జీర్ణ సమస్యలు, అలెర్జీ, పొటాషియం ఎక్కువగా ఉండే మెడిసిన్స్ తీసుకునేవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది.
అరటిపండును తినాలనుకుంటే రోజుకు ఒకటి తింటే సరిపోతుంది. ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)