వామ్మో మెడ నల్లగా మారితే మధుమేహం తప్పదా? మెడ నల్లగా ఉండటమనేది చాలామందిలో కామన్. వివిధ కారణాల వల్ల ఇది వస్తుంది. అయితే మెడ నల్లగా మారడమనేది దీర్ఘకాలిక వ్యాధికి సంకేతమంటున్నారు నిపుణులు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముందు మెడ చుట్టూ నల్లగా మారుతుందని చెప్తున్నారు. మెడపై డార్క్‌గా, వెల్వెట్ స్కిన్ ప్యాచ్‌లు వస్తే అది టైప్ 2 డయాబెటిస్‌కి సంకేతాలట. మెడ, చంక, కనుబొమ్మలు, మోకాళ్లు ప్రాంతాల వద్ద కూడా ఈ నలుపుదనం ఎక్కువవుతుందట. డయాబెటిస్ వచ్చేసరికి ముఖం, చేతులు, పాదాలపై కూడా ఈ నలుపుదనం పెరుగుతుందట. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌పై చేసిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు కనుగొన్నారు. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువైనప్పుడు స్కిన్ కణాల పెరుగుదల ఎక్కువై మెడ నల్లగా మారుతుందట. ఒబేసిటి, హార్మోనల్ సమస్యలు, కొన్నిరకాల మందులు, జెనిటిక్ సమస్యలు కూడా మెడనలుపుదనానికి సంకేతాలేనట. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)