స్క్రీన్ ఎక్కువగా చూస్తే కంటి చూపు మందగిస్తుంది. దీనివల్ల కొందరు కళ్లజోడు ఉపయోగిస్తారు.

అయితే కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకుంటే కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చట.

స్క్రీన్ టైమ్​ని తగ్గించడంతో పాటు కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

క్యారెట్స్​లోని బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఉంటుంది. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి.

డార్క్​ చాక్లెట్​లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రెటీనాను కాపాడి కంటిచూపును మెరుగుపరుస్తాయి.

నట్స్, బాదం, అవిసెగింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 ఉంటుంది. విటమిన్ ఈ ఉంటుంది. ఇవి కంటి సమస్యలను దూరం చేస్తాయి.

బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి కళ్లను రక్షిస్తాయి.

కాలే వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కంటి చూపునకు మంచిది.

ఎగ్స్​లో న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఈ.. రెటినాల్​ని కాపాడుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Envato)