కొందరు బరువు తగ్గాలని.. ముఖ్యంగా పొట్ట తగ్గాలని రాత్రుళ్లు చపాతీలు తింటారు. అయితే మరి చపాతీలు తింటే నిజంగానే పొట్ట తగ్గుతుందా? నిపుణులు సలహాలు ఏంటి? రైస్ మాదిరిగానే.. చపాతీల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీ డైట్నుంచి కార్బ్స్‌ని తీసేస్తే మీరు బరువు తగ్గుతారు కానీ ఫ్యాట్‌ని తగ్గించుకోలేరట. కొవ్వును తగ్గించుకోవాలంటే హై ప్రోటీన్ డైట్, క్యాలోరిక్ డిఫిక్ట్ చేస్తేనే తగ్గుతుందని చెప్తున్నారు. ఫ్యాట్ తగ్గాలంటే మీరు డైలీ తీసుకునే ఫుడ్‌ని కంట్రోల్ చేయాలి. పూర్తిగా మానేయడం కాకుండా తగ్గించి తీసుకోవాలట. రోజూ ఏదొక యాక్టివిటీ చేయాలి. రన్నింగ్, గేమ్స్, స్విమ్మింగ్ ఇలా ఏదొకటి చేయాలి. లేదంటే జిమ్‌కి వెళ్లొచ్చు. మీకు నచ్చిన ఫిజికల్‌గా స్ట్రైస్ చేసే ఏ పని అయినా ఇన్క్లూడ్ చేయవచ్చు. ఇవేమి కుదరట్లేదంటే కనీసం వాక్ చేయాలి. రోజూ అరగంట పాటు ఇవి చేయాలి. వారం తర్వాత ఈ లిమిట్‌ని పెంచుకోవాలి. కానీ డైలీ రోటీన్లో ఇది భాగమైపోవాలి. ఒక్కరోజుతో రిజల్ట్స్ రావు కానీ.. కంటిన్యూగా మీరు ఇవి చేయగలిగితే కచ్చితంగ శరీరంలో ఫ్యాట్ తగ్గుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.