మగవారిలో జుట్టు రాలిపోవడం, బట్టతల వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని రెగ్యూలర్ టిప్స్‌తో జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయవచ్చంటున్నారు నిపుణులు. జుట్టు మరీ ఆయిలీగా, చుండ్రు లేకుండా ఉంటే రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదట. కొందరు రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల స్కాల్ప్ పూర్తిగా పాడై జుట్టు ఎక్కువగా రాలుతుందట. మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచిది. pH లెవల్ 5.5 ఉండే షాంపూ స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతుంది. షాంపూ తర్వాత జుట్టుకి కచ్చితంగా కండీషనర్ అప్లై చేయాలి. ఇది జుట్టుకి మాయిశ్చరైజర్‌ని అందిస్తుంది. దీనివల్ల జుట్టు సాఫ్ట్‌గా అవుతుంది. ఫ్రిజ్జీగా ఉండదు. నచ్చినట్లు స్టైల్ చేసుకునే వీలుంటుంది. తలస్నానానికి ముందు హెయిర్ సీరమ్స్ లేక ఆర్గాన్ ఆయిల్ ఉపయోగిస్తే మంచిది. ఇవి జుట్టుని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. మీరు ఎండలో తిరిగినా జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. బ్లో డ్రైయింగ్.. హై హీట్ సెట్టింగ్స్‌తో జుట్టు పాడవుతుంది కాబట్టి.. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)