ప్రతిరోజు పది నుంచి పదిహేను నిమిషాలు రన్నింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

వారానికి 75 నిమిషాలు అంటే రోజుకు పన్నెండు నిమిషాలు రన్నింగ్ చేస్తే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చని తాజా అధ్యయనం తెలిపింది.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్​మెంటర్​ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్​​లో దీనిగురించి రాసుకొచ్చారు.

రోజుకు పన్నెండు నిమిషాలు పరిగెడితే.. జీవితకాలంలో 12 సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుందట.

కాళ్ల ఎముకలు, కండరాలు, మోకాళ్లు దృఢంగా మారి నొప్పులు తగ్గుతాయట.

కాళ్ల కండరాలు మంచి షేప్​లో వచ్చి.. ఫ్యూచర్​లో ఇబ్బందులు రాకుండా చేస్తాయట.

కొన్ని రకాల క్యాన్సర్​లను తగ్గించే సత్తాని బిల్డ్ చేస్తుందని గుర్తించారు.

వయసు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ బారిన పడకుండా చేస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. మీరు స్ట్రెస్​లో ఉన్నప్పుడు రన్ చేస్తే బాడీ కొత్త ఎనర్జీని అందిస్తుందట.

మెంటల్ హెల్త్​పై ప్రభావం చూపించి.. పాజిటివ్​గా, హ్యాపీగా ఉండేలా చేయడంలో హెల్ప్ చేస్తుందట.

ఇవన్నీ అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మంచిది. (Images Source : Envato)