జాగ్రత్త

వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

కారణాలు ఇవే

వైట్ డిశ్చార్జ్ అనేది మహిళల్లో కామన్ పాయింటే. అయితే ఇది కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల ఎక్కువగా అవుతుంటుంది. అవేంటో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, నిపుణుల సలహాలు ఏంటో చూసేద్దాం.

హార్మోనల్ మార్పులు

శరీరంలో జరిగే హార్మోనల్ మార్పుల వల్ల వైట్ డిశ్చార్జ్ జరుగుతుంది. పీరియడ్స్ సమయంలో, ప్రెగ్నెన్సీ, మోనోపాజ్ దశలో ఇది ఎక్కువగా అవుతుంది. దీనివల్ల ఇబ్బంది ఉండదు.

అండోత్సర్గము..

అండోత్సర్గం సమయంలో గర్భాశయ ముఖద్వారం ద్వారా వైట్ డిశ్చార్జ్ సహజంగా అవుతుది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఈస్ట్ ఇన్​ఫెక్షన్..

ఫంగల్ ఇన్​ఫెక్షన్​ వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది. తెల్లగా.. థిక్​గా ఇది అవుతూ ఉంటుంది.

బ్యాక్టీరియల్..

యోని ప్రాంతంలో బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు ఈ తరహా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇది చెడు వాసనను ఇస్తుంది.

మరిన్నీ..

పారాసైటిక్ ఇన్​ఫెక్షన్స్, లైంగికంగా సంక్రమించే ఇన్​ఫెక్షన్ల వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది.

మందుల ప్రభావం..

కొన్నిరకాల మందులు రెగ్యూలర్​గా ఉపయోగించడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ కావొచ్చు.

జీవన శైలిలో మార్పులు

యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం, బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం, ఒత్తిడి, ధూమపానం, షుగర్, డైయిరీ ప్రొడెక్ట్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇది అవుతుంది.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త

వైట్ డిశ్చార్జ్ కామన్ కానీ.. కొన్ని లక్షణాలుంటే వైద్యుల సలహా తీసుకోవాలి. యోని ప్రాంతంలో మంట, దురద, వాసన, రంగులో మార్పు, నొప్పి, జ్వరం వంటి లక్షణాలుంటే వైద్యుల దగ్గరకు వెళ్లాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. వాసన వచ్చే ఉత్పత్తులు ఆ ప్రాంతంలో వాడకూడదు. హైడ్రేటెడ్​గా ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్​ తీసుకుంటూ రెగ్యూలర్​గా వ్యాయామం చేయాలి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. (Images Source : Envato)